'100% లవ్' చిత్రం తమన్నా కొంప ముంచబోతోందా?
సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందిన '100% లవ్'చిత్రం మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసిన తమన్నాకు ఈ సినిమాలో తను పోషించిన మహాలక్ష్మి పాత్ర తన జీవితంపై ప్రభావం చూపుతోంది అంటోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ..కొన్ని పాత్రలు జీవితంపై ప్రభావం చూపుతాయి అనడానికి ఉదాహరణ మహాలక్ష్మి పాత్రే. ఈ సినిమా పూర్తయిన తరవాత నాక్కూడా ఇలాంటి ప్రేమ కథ ఉంటే బాగుండుననిపించింది. మంచి మనసున్న ప్రేమికుడు దొరికితే ఆ ఆనందమే వేరు. కానీ సినిమా వేరు... జీవితం వేరు. ఏం చేస్తాం.మనసున్న ప్రేమికుడు దొరకలన్నా అదృష్టం ఉండాలి అంది.మరి మీరు మనస్సులేని ప్రేమికుడుని ఎవరినన్నా ప్రేమించారా అంటే మాత్రం ప్రేమపై నా అభిప్రాయం నాకుంది. కానీ ఇప్పటి వరకూ ఎవర్నీ ప్రేమించలేదు. అసలు ఆ భావనే కలగలేదు అంది వెంటనే.తనతో ప్రేమాయణం నడిపి పెళ్ళి కి రెడీ అవుతన్న తమిళ హీరో కార్తి గురించేనా ఆమె అంటోంది అని కొందరు అనుమానపడితే మరికొందరు మాత్రం కెరీర్ ని ప్రక్కన పెట్టి ఈ ప్రేమ వ్యవహారంలో పడితే గ్యారెంటీగా 100% కొంపముంచుతుందంటున్నారు.


Click it and Unblock the Notifications











