మహానటి ఆడియో లాంచ్ దిగ్గజ నటి బయోపిక్‌లో మధుర ఘట్టం.. ఆమెని పెళ్లి చేసుకునే వాడిని!
భారతీయ చలన చిత్ర రంగంలో దిగ్గజ నటి సావిత్రికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందరో నటులకు ఆదర్శం ఆమె. నటిగా తిరుగులేని ఖ్యాతిని గడించిన సావిత్రి జీవితానికి సంబందించిన ఎన్నో మధురమైన విషయాలు, చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. ఆమె జీవితం గురించి పూర్తిగా అభిమానులకు తెలియదు. సావిత్రి బయోపిక్ గా రూపొందుతున్న మహానటి చిత్రం ద్వారా సావిత్రి జీవితానికి సంబంధించిన అనేక విషయాలని దర్శకుడు నాగ అశ్విన్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో వేడుక నేడు జరగబోతోంది. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతుండడం విశేషం. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ దేవర కొండా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొద్ది సేపటి క్రితమే ఆడియో వేడుక ప్రారంభమైంది.

ఆడియో వేడుకకు నాగార్జున, రాఘవేంద్ర రావు, నాని వంటి ప్రముఖులు ఇప్పటికే హాజరయ్యారు. వేదికపైకి సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ చాలా సరదాగా మాట్లాడాడు. సావిత్రి గురించి నేను చెప్పేదేముంది.. ఆమె మహా నటి. సావిత్రి గారు ఏ సమయంలో ఉండి ఉంటె ఆమె ప్రేమలో పడేవాడిని అని విజయ్ దేవరకొండ సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ చిత్రంలో జెమినీగణేశన్ పాత్ర చూసి తీరాల్సిందే అని విజయ్ దేవరకొండ తెలిపాడు.


Click it and Unblock the Notifications











