twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌పై విమర్శలకు చెక్.. ఒకే పంచ్ విసిరి.. నోర్లు మూయించిన నాగార్జున

    By Rajababu
    |

    తెలుగు సినీ పరిశ్రమను ప్రస్తుతం అనేక వివాదాలు చుట్టుముట్టిన పరిస్థితి. వివాదాస్పద నటి శ్రీరెడ్డి, కత్తి మహేష్, ఇతర నటీనటుల విమర్శలు, ఆరోపణలు చేయడంతో టాలీవుడ్ సంక్షోభంలో మునిగిందా అనే సందేహాలు తలెత్తాయి. అవకాశాలు ఎరజూపి అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నారంటూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి గురిచేసింది. ఆ వివాదం నుంచి బయటపడటానికి సినీ పెద్దలు అనేక చర్యలు తీసుకొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మహానటి ఆడియో వేడుకులో నాగార్జున పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు కొందరికి పంచులుగా తగిలాయనే మాట వినిపించింది. ఇంతకీ నాగార్జున మాట్లాడినందేమంటంటే..

    బయోపిక్ తీయాలంటే అర్హత ఉండాలి

    బయోపిక్ తీయాలంటే అర్హత ఉండాలి

    ఓ మహోన్నత వ్యక్తి గురించి బయోపిక్ తీయాలంటే తీయబోయే వ్యక్తికి అర్హత ఉండాలి. తెలుగు సూపర్‌స్టార్ అందులో ఓ మహిళ గురించిన బయోపిక్ తీయడం ఇండస్ట్రీ గర్వంగా ఉంది.

    అంతా ఆడపిల్లలేనట

    అంతా ఆడపిల్లలేనట

    ఓ మహిళా సూపర్ట్‌స్టార్ గురించి బయోపిక్‌ను నిర్మాత అశ్వినీదత్ తీయలేదు. ఆయన కూతుళ్లు స్వప్న, ప్రియాంక దత్ తీశారు. వారిద్దరు ఆడపిల్లలు కావడం విశేషం. అంతేకాకుండా ఈ సినిమాకు పనిచేసిన వారిలో దాదాపు 20 మంది టెక్నిషియన్స్ పనిచేశారట. ఆడియో ఫంక్షన్‌కు బ్రహ్మండంగా సెట్ వేసింది ఆడపిల్లలేనట.

    ఇండస్ట్రీలో మహిళలకు ఉన్నత గౌరవం

    ఇండస్ట్రీలో మహిళలకు ఉన్నత గౌరవం

    ఇలా సినీ పరిశ్రమలో ఆడపిల్లలకు పెద్ద పీటవేసి ఉన్నత గౌరవాన్ని కల్పించేది మన తెలుగు చిత్ర పరిశ్రమ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది అని నాగార్జున అన్నారు.

    నాకు వయసు మీద పడింది..

    నాకు వయసు మీద పడింది..

    మహానటి సావిత్రి గురించి దర్శకుడు నాగ అశ్విన్‌కు, దుల్కర్, విజయ్ దేవరకొండకు కూడా తెలియదు. కానీ ఈ సినిమాతో వారు అనుబంధం కావడం గొప్ప విషయం. ఇక ఈ సినిమాలో నాగచైతన్య నా ఫాదర్ రోల్ వేయడం ఏమిటీ? వేస్తే ఆ పాత్ర నేనే వేయాలి. కానీ నా వయసు మీద పడింది. ఆ పాత్ర వేయడానికి నా వయసు ఎక్కువవుతుందేమో. ఇంత మంచి సినిమాలో నటించిన వీరందరిని చూస్తే నాకు అసూయగా ఉంది. అని నాగార్జున పేర్కొన్నారు.

     మహానటిలో నా కుటుంబం

    మహానటిలో నా కుటుంబం

    మహానటి చిత్రంలో నేను నటించకపోయినా నాగచైతన్య, కోడలు ఈ సినిమాతో అనుబంధం కావడం ఆనందంగా ఉంది. ఏ విధంగానో నా ఫ్యామిలీ సావిత్రితోనూ, సినిమాతోనూ అనుబంధం కావడం మరింత ఆనందంగా ఉంది అన్నారు.

    English summary
    Mahanati Audio release function held in Hyderabad Annapurna Studios. Nagarjuana, Junior NTR, Nani, Vijay Deverkonda, Keerthi Suresh are attended for the event. Nagarjuna speech praising women become highlight of the function.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X