twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాబు మామూలోడు కాదు, వందకు 110 మార్కులు.. మహానాయకుడుపై మహానటి డైరెక్టర్!

    |

    స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. నాదెండ్ల భాస్కర రావు ఎపిసోడ్, పార్టీలో చంద్రబాబు పాత్ర లాంటి రాజకీయ అంశాలని ఈ చిత్రంలో చూపించారు. ఎన్టీఆర్, బసవతారకం మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా ఎమోషనల్ గా చూపించారు. మహానాయకుడు చిత్రం గురించి వరుసగా సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు.

    బాబు మామూలోడు కాదు

    బాబు మామూలోడు కాదు

    మహానటి చిత్రంతో యువ దర్శకుడు నాగ అశ్విన్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. సావిత్రి జీవితాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన నాగ అశ్విన్ ప్రశంసలు దక్కించుకున్నాడు. గురువారం రోజు ఎన్టీఆర్ మహానాయకుడు ప్రీమియర్ షోని ప్రదర్శించారు. ఈ షోకు నందమూరి కుటుంబ సభ్యులు, టాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరయ్యారు. నాగ అశ్విన్ ఎన్టీఆర్ మహానాయకుడు చూశాక ట్విట్టర్ ద్వారా స్పందించాడు. బాబు మామూలోడు కాదు అంటూ మహానాయకుడులో రానా సన్నివేశానికి సంబంధించిన ఫోటోని పోస్ట్ చేశాడు.

    వందకు 110

    రానా ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో నటించి మరో అద్భుతమైన పాత్రని తన ఖాతాలో వేసుకున్నాడని నాగ అశ్విన్ ప్రశంసించాడు. బాలయ్య పెర్ఫామెన్స్ కు తాను వందకు 110 మార్కులు వేస్తానని నాగ అశ్విన్ ట్విట్టర్ లో కామెంట్ చేశాడు. విద్యాబాలన్ నటనకు కూడా ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది అని నాగ అశ్విన్ ప్రశంసించాడు.

     అక్కడ వరకు మాత్రమే

    అక్కడ వరకు మాత్రమే

    ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో లక్ష్మి పార్వతి ఎపిసోడ్ లేదు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం మరణించేవరకు మాత్రమే చూపించారు. బాలయ్య వివాదాల జోలికి పోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ ని మాత్రం హైలైట్ చేశారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాక ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని కూడా చూపించారు.

     సెలెబ్రిటీలంతా

    సెలెబ్రిటీలంతా

    ఇక ఎన్టీఆర్ మహాయకుడు ప్రీమియర్ షో చూసిన సెలెబ్రిటీలంతా మీడియాతో తమ స్పందన ఇప్పటికే తెలియజేశారు. పరుచూరి గోపాలకృష్ణ, వివి వినాయక్, పూరి జగన్నాథ్, ఛార్మి, నారా బ్రాహ్మణి లాంటి, తమ్మారెడ్డి భరద్వాజ లాంటి ప్రముఖులంతా మహానాయకుడు చిత్రం బావుందంటూ ప్రశంసించారు.

    English summary
    Mahanati Director Nag Ashwin interesting comments on NTR Mahanayakudu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X