ఆకాశ వీధిలో అందాల జాబిలి: మ‌హాన‌టిలో కీర్తి సురేష్ లుక్

కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ‘మహానటి’ సినిమాకు సంబంధించి స్పెషల్ లుక్ రిలీజ్ చేశారు.

By Bojja Kumar

న‌టి కీర్తి సురేష్ 'మహానటి' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తోంది. అక్టోబర్ 17న కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ 'వై జయంతి మూవీస్' వారు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఆకాశ వీదిలో అందాల జాబిలి... మా సినిమాలో 'మహానటి' పాత్ర పోషిస్తున్న కీర్తి సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ.... ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో కేవలం ఆమె కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ కళ్లను చూస్తుంటే అచ్చం సావిత్రిని చూసినట్లే ఉండటం విశేషం.

మహానటి

మహానటి

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ప్రేక్షకులను అలరించబోతోంది. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన సావిత్రి సినిమా రంగంలో మహానటిగా ఎదిగిన పరిణామాలతో పాటు, ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను సైతం చూపించనున్నారు.

ముఖ్యమైన పాత్రల్లో

ముఖ్యమైన పాత్రల్లో

ఈ చిత్రంలో సావిత్ర భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్క‌ర్ స‌ల్మాన్‌, జమున పాత్రలో సమంత, నిర్మాత చక్రపాణి పాత్రలో ప్రకాష్ రాజ్, ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు పోషిస్తున్నారు. వీరితో పాటు విజ‌య్ దేవ‌రకొండ, షాలిని పాండే, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. 2018లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

కీర్తి సురేష్ పర్సనల్ లైఫ్ విశేషాలు

కీర్తి సురేష్ పర్సనల్ లైఫ్ విశేషాలు

కీర్తి సురేష్ అక్టోబర్ 17, 1992లో జన్మించింది. ఆమె తల్లి మేనక నిన్నటితరం నటి. దక్షిణాదిలో అన్ని భాషా చిత్రాల్లోనూ నటించింది. ఆమె తండ్రి జి. సురేష్‌ కుమార్ మలయాళ సినీ నిర్మాత. సినిమాల్లోకి రావడానికి అమ్మే నాకు స్ఫూర్తి అని కీర్తి సురేష్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

సినిమా కెరీర్

సినిమా కెరీర్

8 ఏళ్ల వయసులోనే బాలనటిగా కెరీర్ ప్రారంభించిన కీర్తి... 2013లో గీతాంజలి అనే మలయాళ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ‘నేను శైలజ' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీని తర్వాత ఆమె నానితో నటించిన ‘నేను లోకల్' మూవీ కూడా పెద్ద హిట్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 25వ సినిమాతో పాటు, మహానటి సినిమా చేస్తోంది.

నాన్న నిర్మాతగా తొలి సినిమా

నాన్న నిర్మాతగా తొలి సినిమా

డిగ్రీ మూడో సంవత్సరంలో ఉండగా నాకు మలయాళంలో ‘గీతాంజలి'లో చేసే అవకాశం వచ్చింది. 2013లో వచ్చిన ఆ సినిమాకి దర్శకుడు ప్రియదర్శన్‌, హీరో మోహన్‌లాల్‌. వాళ్లని ‘ప్రియన్‌ అంకుల్‌', ‘లాల్‌ అంకుల్‌' అని పిలిచేంత చనువుంది నాకు. వారిద్దరి కాంబినేషన్లోని మొదటి సినిమాని నాన్న నిర్మించారు అని గతంలో కీర్తి సురేష్ ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చారు.

పెద్దగా కష్టాలు పడలేదు

పెద్దగా కష్టాలు పడలేదు

నా జీవితంలో సినిమాలు తప్ప సినిమా కష్టాలేమీ లేవు. సినిమాల్లోకి రావడానికీ, అవకాశాల కోసమూ నేనెప్పుడూ కష్టపడలేదు. ఇదంతా దేవుడి దీవెన అని చెప్పాలి. మొదట్లో అమ్మానాన్నల సాయం తీసుకున్నా, ఆ తర్వాత నుంచి నా కెరీర్‌ను నేనే నిర్మించుకుంటున్నాను. నేనిక్కడ ఏదో సాధించాలి, డబ్బు సంపాదించాలి అని రాలేదు. సినిమాపైన ఇష్టంతో వచ్చాను. కాబట్టి నేనెప్పుడూ అవకాశాలకోసం పరుగెత్తలేదు. నిదానంగానే పనిచేసుకుంటున్నాను. ఈరోజు వరకూ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. భవిష్యత్తులోనూ అలానే ఉంటానని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది కీర్తి సురేష్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X