‘మహానటి’ మేకింగ్ వీడియో: 2 వేల ఆడిషన్స్, 32 సెట్స్, వందలాది కాస్టూమ్స్.....
ప్రముఖ నటి సావిత్రం జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'మహానటి' ఆడియో వేడుక అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో హీరో నాని చేతుల మీదుగా విడుదల చేశారు. మేకింగ్ వీడియోలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఈ సినిమా కోసం దాదాపు 2 వేలకు పైగా ఆర్టిస్టులను ఆడిషన్ చేశారు. అందులో నుండి సినిమాలోని పాత్రలకు తగిన నటీనటులను ఎంపిక చేశారు. ప్రముఖ టెక్నీషియన్స్, వందలాది కాస్టూమ్స్, సావిత్రి కాలానికి సంబంధించిన పరిస్థితులు కళ్లకు కట్టేలా 32 సెట్స్ ఈ సినిమా కోసం వేశారు. మేకింగ్ వీడియోలో ఈ సినిమా కోసం చిత్ర బృందం ఎంత కష్టపడిందో మూడు నిమిషాల వీడియోలో చూపించే ప్రయత్నం చేశారు.

ఈ చిత్రంలో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషిస్తోంది. సావిత్రి జీవితం మీద రీసెర్చ్ చేసే జర్నలిస్టు పాత్రలో సమంత నటించింది. ఆమెతో పాటు ఉండే ఫోటోగ్రాఫర్ పాత్రను విజయ్ దేవరకొండ పోషించారు.
దుల్కర్ సల్మాన్, శాలిని పాండే, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న "మహానటి" చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వనుంది. దర్శకుడు నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తున్నాడు. ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ప్రొడక్షన్ డిజైన్: శివం, ఆర్ట్: అవినాష్, కాస్ట్యూమ్స్: గౌరాంగ్, అర్చన, స్టైలిస్ట్: ఇంద్రాక్షి, కెమెరా: డాని, కళా నేతృత్వం: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, దర్శకత్వం: నాగ అశ్విన్, నిర్మాత: ప్రియాంక దత్.


Click it and Unblock the Notifications











