మహానటి ఆడియో విడుదల తేదీ ఖరారు!
భారతీయ సినీ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నటి సావిత్రి. ఆమె బయోపిక్ మహానటిగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాబ్లీ బ్యూటీ కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ చూస్తే సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఎంతగా ఒదిగిపోయిందో అర్థం అవుతుంది.
ఇటీవల విడుదలైన టీజర్, మూగమనసులు అనే సాంగ్ అభిమానులని తెగ ఆకట్టుకుంటున్నాయి. సావిత్రి లాంటి లెజెండరీ నటిలా నటించడం ఆమెలా హావ భావాలూ పలికించడం అంత సులువు కాదు. కానీ కీర్తి సురేష్ అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది.

మహా నటి చిత్రాన్ని చారిత్రాత్మకంగా రూపొందించడానికి దర్శకుడు నాగ అశ్విన్ కృషి చేస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.భారీ అంచనాలతో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబందించిన తాజా అప్డేట్ వచ్చింది. మహానటి ఆడియో వేడుక మే 1 ఘనంగా నిర్వహించనున్నారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తుండడం విశేషం.


Click it and Unblock the Notifications











