twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీడియో: మహానటి డిలీటెడ్ సీన్.. మహానటిని మురిపిస్తూ డాన్స్ చేసిన కీర్తి సురేష్, ఏఎన్నార్ సినిమా!

    |

    Recommended Video

    వీడియో: మహానటి చిత్రంలో డిలీటెడ్ సీన్

    మహానటి చిత్ర వేడి ఇంకా చల్లారడంలేదు. ఈ చిత్ర జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది. లెజెండరీ నటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండడంతో విడుదల తరువాత కూడా చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్, జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, మధురవాణిగా సమంత, ఫోటో గ్రాఫర్ గా విజయ్ దేవరకొండ మంచి నటన కనబరిచారు. తాజగా చిత్ర యూనిట్ సినిమాలో పొందుపరచని వీడియోని విడుదల చేసింది.

    అచ్చు మహానటిలాగే

    అచ్చు మహానటిలాగే

    సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ కు విమర్శకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. సావిత్రిలా హావభావాలు పలికించడం కష్టంతో కూడుకున్న పని. కానీ కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది.

    కళ్ళముందుకు మహానటి జీవితం

    కళ్ళముందుకు మహానటి జీవితం

    సావిత్రి జీవితం గురించి అనేక అపోహలు అభిమానుల్లో ఉన్నాయి. ఈ చిత్రం ద్వారా వారంతా సావిత్రి జీవితాన్ని మరో మారు చూడగలిగారు. అత్యంత క్లిష్టమైన అంశాన్ని దర్శకుడు నాగ అశ్విన్ చాలా చక్కగా తెరకెక్కించారని ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే.

    డిలీటెడ్ వీడియో

    తాజగా మహానటి చిత్ర యూనిట్ ఓ వీడియోని విడుదల చేసింది. చిత్రంలో పొందుపరచని సన్నివేశాని విడుదల చేసింది. అందులో కీర్తి సురేష్ అచ్చు సావిత్రిలా హావభావాలు పలికించడం, డాన్స్ చేయడం చూస్తే ఫిదా కావలసిందే.

    ఏఎన్నార్ చిత్రం

    ఏఎన్నార్ చిత్రం

    చిత్రంలో చేర్చని ఈ వీడియో ఏఎన్నార్ చిత్రం దొంగరాముడుకు సంబందించినది. ఆ చిత్రంలో రావోయి మా ఇంటికి అనే సాంగ్ కోసం కీర్తి సురేష్ డాన్స్ ని ఈ వీడియో లో చూడొచ్చు. 1955 లో వచ్చిన దొంగరాముడు చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో ఎన్నార్, సావిత్రి, జామున, జగ్గయ్య నటించారు.

    English summary
    Mahanati Movie Deleted Scene. Keerthy suresh rock Savitri steps
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X