తలవంచి నమస్కరిస్తున్నా.. నటనతో ప్రాణాలు తోడేశారు.. నాని, దుల్కర్, విజయ్, సమంత ట్వీట్స్

By Rajababu

ప్రముఖ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం మే 9న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలోని సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేశాయి. తొలి ఆట నుంచే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. మహానటి సావిత్రి పాత్రలో యువ తార కీర్తి సురేష్ నటించారు. సమంత, విజయ దేవరకొండ కీలకపాత్రలను పోషించారు. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ జెమినీ గణేషన్ పాత్రలో నటించారు. వైజయంతి ఫిల్మ్స్, స్వప్న సినిమా బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రానికి నాగ ఆశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంపై సినీ ప్రముఖులు ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురపించారు.

జెమినీ పాత్ర ఇచ్చినందుకు

జెమినీ పాత్ర ఇచ్చినందుకు

మహానటి సినిమాపై వస్తున్న స్పందన చూసి చాలా ఆనందం కలుగుతున్నది. గొప్ప ఫీలింగ్ కలుగుతున్నది. నాపై విశ్వాసం కలిగి జెమినీ గణేషన్ పాత్రను ఇచ్చినందుకు దర్శకుడు నాగ అశ్విన్, నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక, అశ్వినీదత్‌కు థ్యాంక్స్. కీర్తి సురేష్, సమంత రుత్ ప్రభు, విజయ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్‌, చిత్ర యూనిట్‌కు ప్రేమతో కూడిన నా అభినందనలు అని దుల్కర్ సల్మాన్ ట్వీట్ చేశారు.

 కృషిగా గొప్పగా ఉంది

కృషిగా గొప్పగా ఉంది

మహానటి చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్షలు. వారికి శుభాకాంక్షలు తెలిపే ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన సావిత్రి కథను అందించడానికి చేసిన కృషి చాలా గొప్పగా ఉంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడూ చూడాలా అని ఉన్నది అని నాని ట్వీట్ చేశారు.

 ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్

ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్

నాగ అశ్విన్‌, స్వప్న దత్‌కు కంగ్రాట్స్. సావిత్రి బయోపిక్‌ తెరకెక్కించే అంశంపై మీ నమ్మకం, పట్టుదల, అంకితభావం అద్భుతం అని దర్శక ధీరుడు రాజమౌళి ట్వీట్ చేశారు.

సావిత్రి జీవితం పరిపూర్ణం

మహానటి చిత్రాన్ని గురువారం రాత్రి చూశాను. సావిత్రి జీవితం పరిపూర్ణం. మహోన్నతమైన చిత్రాన్ని రూపొందించిన నాగ అశ్విన్, అతని జట్టుకు తలవంచి నమస్కరిస్తున్నాను. కీర్తీ సురేష్ తన నటనతో ప్రాణాలు తోడేసింది. సమంత, దుల్కర్ సల్మాన్ ఎంపిక గొప్పగా ఉంది. సినిమా సూపర్ హిట్. సూపర్ హిట్ కంటే అద్భుతమైన అనుభవం అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.

కీర్తీ సురేష్ నటన అద్భుతం

కీర్తీ సురేష్ నటన అద్భుతం

మహానటి లాంటి గొప్ప చిత్రంలో ఓ చిన్న పాత్రను పోషించడం గర్వంగా ఉంది. మధురవాణి లాంటి గొప్ప పాత్రను ఇచ్చిన నాగ అశ్విన్ థ్యాంక్స్. మహానటిగా కీర్తీ సురేష్ నటన అద్భుతం. వైజయంతి ఫిల్మ్స్, విజయ్ దేవరకొండ, దుల్కర్, మహానటి చిత్ర యూనిట్‌కు ప్రేమతో అభినందనలు అని సమంత అక్కినేని ట్వీట్ చేశారు.

వండర్‌ఫుల్ ఫీలింగ్

వండర్‌ఫుల్ ఫీలింగ్

తాతయ్య పాత్రలో నాగ చైతన్య చూడటం వండర్‌ఫుల్‌ ఫీలింగ్ అని సుషాంత్ ట్వీట్ చేశారు. మహానటి చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగచైతన్య నటించిన సంగతి తెలిసిందే.

 మహానటి ఓ సవాల్

మహానటి ఓ సవాల్

మహానటి, గొప్ప మనసున్న నటి సావిత్రి జీవిత కథను అద్బుతంగా తెరకెక్కించడం ఓ సవాల్. మీరందరూ ఆ సవాల్‌ను సులభంగా ఎదుర్కొన్నారు. చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్. స్వప్న, ప్రియాంక దత్‌కు గట్టిగా అభినందనలు తెలుపుతున్నాను. సినీ రంగంలో మహిళలదే ఇక రాజ్యం అని మంచు లక్ష్మీ ట్వీట్ చేశారు.

 సూపర్ డూపర్ క్లాసిక్

సూపర్ డూపర్ క్లాసిక్

క్లాసిక్ టీమ్ నుంచి మహానటి అనే సూపర్ డూపర్ క్లాసిక్ వచ్చింది. మహానటి చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతీ ఒక్కరు అద్భుతంగా పనిచేశారు అని మంచు మనోజ్ ట్వీట్ చేశారు.

మహానటి గొప్ప విజయం

మహానటి గొప్ప విజయం

అశ్వినిదత్ ఒక మంచి నిర్మాత. అతని కుమార్తెలిద్దరూ ధైర్యం చేసి డబ్బుకు వెనుకాడక 'సావిత్రి' గారి జీవిత చరిత్రని సినిమాగా తీశారు. గొప్ప విజయాన్ని సాధించిందని విన్నాను. అలాంటి మంచి సినిమాలో నాకూ ఒక మంచి పాత్రనిచ్చి 'శభాష్' అనిపించుకునేలా చేశారు అని మోహన్‌బాబు ట్వీట్ చేశారు.

 మధురమైన అనుభూతి

మధురమైన అనుభూతి

మహానటి సావిత్రి కాలానికి దర్శకుడు నాగ అశ్విన్ తీసుకెళ్లారు. మాటల్లో చెప్పలేని అద్భుతమైన ఫీలింగ్. సావిత్రి పాత్రను చేయడానికి కీర్తి సురేష్ నోచుకొన్నారు. ఆ పాత్రలో ఆమె జీవించారు. ఏఎన్నాఆర్‌గా నాగ చైతన్య సూపర్బ్. స్వప్న దత్‌కు, చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్. సావిత్రి సినిమా చూడటం మధురమైన అనుభూతి అని మారుతి ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X