సావిత్రి చేసిన చిన్న పొరపాటు.. పెద్ద రహస్యం బయట పడింది, ఆమె వివాహం!

మహానటి చిత్ర విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఆసక్తి పెరిగిపోతోంది. భారతీయ చలనచిత్ర చరిత్రలో దిగ్గజ నటి సావిత్రి జీవిత చరిత్ర మహానటి గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో సావిత్రి జీవితం గురించి అనేక రహస్యాలని చూపించనున్నారు. సావిత్రి వ్యక్తిగత జీవితం గురించి అనేక పుకార్లు అభిమానుల్లో ఉన్నాయి. ఆ సందేహాలన్నీ మహా నటి చితం ద్వారా నివృత్తి అవుతాయట. చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ సావిత్రి జీవితం గురించి శోధించి మరీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల ఆడియో వేడుక కూడా ఘనంగా జరిగింది. కీర్తి సురేష్ ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఒదిగిపోయిన కీర్తి సురేష్

ఒదిగిపోయిన కీర్తి సురేష్

మహానటిగా కీర్తి గడించిన సావిత్రిలా నటించడం అంటే మాటలు కాదు. ఆమెలా హావైభవాలు పలికించడం చాలా కష్టంతో కూడుకున్నా పని. మహానటి టీజర్ చూస్తుంటే సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయినట్లు కనిపిస్తోంది. సావిత్రి మళ్ళి దిగివచ్చిందా అనేంతగా కీర్తి సురేష్ కు ప్రశంసలు దక్కుతున్నాయి.

వింటేజ్ కార్లంటే మోజు

వింటేజ్ కార్లంటే మోజు

సావిత్రికి వింటేజ్ కార్లంటే విపరీతమైన మోజు అట. ఆమె నటిగా ఉన్న సమయంలో ఎవరిదగ్గర లేనన్నీ వింటేజ్ కార్ల కలెక్షన్ ఉండేదని మహానటి చిత్ర యూనిట్ తెలిపింది. దానికి సంబందించిన సన్నివేశాలు మహానటిలో ఉన్నాయట. ఏఎన్నార్, ఎన్టీఆర్ తో సమానంగా పారితోషకం అందుకున్న ఏకైన నటి సావిత్రి మాత్రమే అని కూడా చిత్ర యూనిట్ తెలిపింది.

సావిత్రి చేసిన చిన్న పొరపాటు

సావిత్రి చేసిన చిన్న పొరపాటు

సావిత్రి వివాహం గురించి కూడా అప్పట్లో పుకార్లు ఉండేవి. లక్స్ వాణిజ్య ప్రకటన కోసం ఒప్పంద పత్రంలో సావిత్రి.. సావిత్రి గణేశన్ అని పొరపాటుగా సంతకం చేశారట. జెమినీ గణేశన్ తో వివాహం జరిగిందనే రహస్యం అలా బయట పడిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇలాటి ఆసక్తికర అంశాలు చిత్రంలో చాలా ఉన్నాయట.

స్టార్ నటులంతా

స్టార్ నటులంతా

మహానటి చిత్రంలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవర కొండా వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్ జెమిని గణేశన్ పాత్రలో నటిస్తున్నాడు. మహానటి చిత్రం మే 9 విడుదలకు ముస్తాబవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X