ట్విట్టర్ రివ్యూ: తిరుగులేని 'మహానటి'.. కీర్తి, దుల్కర్ కెమిస్ట్రీ కేక, చైతు అచ్చు గుద్దినట్లు!

Recommended Video

Mahanati Movie Twitter Review

తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సందర్భం రానే వచ్చింది. మహానటి సావిత్రికి అభిమానులు కానీ తెలుగు వారు ఉండరు. ఆమె సినీ జీవితం తిరుగులేని ప్రస్థానం. ఎన్టీఆర్, ఎన్నార్ లతో పోటీపడిన తొలి లేడీ సూపర్ స్టార్ సావిత్రి. ఆమె జీవితంలో ఎన్నో మధురమైన అనుభూతులు, ఒడిదుడుకులు ఉన్నాయి. సావిత్రి జీవితం గాధ వెండి తెరపై ఆవిష్కృతమవుతుంటే అందరిలో ఆసక్తి నెలకొనడం సహజమే. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తూ రూపొందించిన చిత్రం మహానటి. దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అప్పట్లో అతిరథ మహారథులుగా చెప్పపడే నటుల పాత్రలో నేటి ప్రముఖనటులంతా నటించారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రీమియర్ షోల ప్రదర్శన యుఎస్ లో పూర్తయింది. వెండి తెరపై చూపించిన సావిత్రి జీవిత చరిత్రకు అభిమానుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం..

అద్భుతమైన రెస్పాన్స్

యూఎస్ నుంచి మహానటి టాక్ వచ్చేసింది. సినిమా అద్భుతం అంటూ ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తోంది. సావిత్రి జీవిత గాధకు ప్రేక్షకులంతా ఫిదా కావడం ఖాయంగా కనిపిస్తోంది.

కీర్తి సురేష్ గ్రేట్ అనిపించేలా

కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించింది. ఆమె నటన గొప్పగా ఉంది. చిత్రాన్ని అన్ని పాత్రలని బాగా సెట్ చేసారు.

చైతు అచ్చు అలాగే

నాగ చైతన్య ఈ చిత్రంలో ఎన్నార్ రోల్ లో నటించారు. తన తాతగారి పాత్రలో చైతు అచుగుద్దినట్లు దిగిపోయాడని ప్రశంసలు దక్కుతున్నాయి. చైతూని పెట్టి ఎన్నార్ బయోపిక్ కూడా చేయవచ్చని అభిమానులు అంటున్నారు.

మరో బ్లాక్ బస్టర్

ఇప్పటికే సమంత అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. మహానటి చిత్రం ద్వారా ఆమె ఖాతాలో మరో ఘనవిజయం చేరింది.

కెమిస్ట్రీ అదుర్స్

జెమినీ గణేశన్ పాత్రలో మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించాడు. దుల్కర్, కీర్తి సురేష్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ముఖ్యంగా పెళ్లి సన్నివేశంలో వీరి జంట ప్రేక్షకులకు కన్నుల పండుగే.

ఫస్ట్ హాఫ్ అదిరింది

ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. అన్ని పాత్రలు ప్రేక్షకులని మెప్పిస్తాయి.కీర్తి సురేష్ నటనకు అద్భుతమైన స్పందన వస్తోంది.

ఖచ్చితంగా చూడాల్సిన చిత్రం

మహానటి చిత్రాన్ని ప్రేక్షకులు క్లాసిక్ ఫిలిం గా అభివర్ణిస్తున్నారు. ప్రతిఒక్కరు చూడాల్సిన చిత్రం.

బాహుబలి 2 తరువాత

బాహుబలి 2 చిత్రం తరువాత తెలుగు ప్రేక్షకులందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం మహానటి.

నాగ అశ్విన్ దర్శకత్వం

లెజెండ్రీ నటి సావిత్రి జీవిత చరిత్రని నాగఅశ్విన్ అద్భుతంగా తెరకెక్కించాడు. అన్ని పాత్రలు అంచనాలకు తగ్గట్లుగా ఉన్నాయి.

యునానిమస్ టాక్

మహానటి చిత్రానికి ఆడియన్స్ నుంచి యునానిమస్ టాక్ వస్తోంది. బొమ్మ అదిరింది అంటూ పోస్ట్ చేస్తున్నారు. కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్ తిరుగులేని నటన కనబరిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X