»   » మహానటి ప్రీ రిలీజ్ రివ్యూ: సావిత్రిగా కీర్తి సురేష్‌పైనే అందరి చూపు!

మహానటి ప్రీ రిలీజ్ రివ్యూ: సావిత్రిగా కీర్తి సురేష్‌పైనే అందరి చూపు!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన మహానటి చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రం మంగళవారం (మే8న) అమెరికాలో, బుధవారం (మే9న) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేష్, జెమినీ గణేషన్‌గా దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు.

  Mahanati Movie : Keerthi Suresh Interview

  వైజయంతి మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి నాగ అశ్విన్ దర్శకుడు కాగా, ప్రియ, స్వప్నాదత్ నిర్మాతలుగా వ్యవహరించారు. మహానటి చిత్రం అమెరికాలో 150 లొకేషన్లలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఎంతో అద్భుతంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూడటానికి ప్రేరేపించే ప్రధాన అంశాలు ఇవే..

  అందం, అభినయంతో సావిత్రి

  అందం, అభినయంతో సావిత్రి

  దక్షిణాదిలో తొలి సూపర్‌స్టార్‌గా సావిత్రికి పేరుంది. అందం, అభినయం ఆమె సొంతం. దక్షిణాదిలో ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, ఎంజీఆర్ లాంటి దిగ్గజ నటీనటులతో నటించారు. నటిగా అద్భుతమైన కీర్తి, డబ్బును సంపాదించుకొన్నారు. తన జీవితంలో జెమినీ గణేషన్‌తో ప్రేమలో పడ్డాక తాగుడుకు బానిసైంది. ఆమె జీవితంలో చోటుచేసుకొన్న ఆనంద క్షణాలు, విషాదకర సంఘటనలను మహానటి చిత్రంలో చూపించారు.


   మహానటిలో ప్రముఖ నటులు

  మహానటిలో ప్రముఖ నటులు

  మహానటిలో తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖు నటులందరూ ఈ చిత్రంలో కనిపించారు. రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి, షాలిని పాండే, నాగచైతన్య, అవసరాల శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగ లాంటి ఎందరో నటించారు. ప్రముఖ నటుడు మోహన్‌బాబు ఎస్వీరంగారావుగా కనిపించారు. ప్రకాశ్ రాజ్ ఆలూరి చక్రపాణిగా నటించారు.


  దర్శకుడిగా నాగ అశ్విన్

  దర్శకుడిగా నాగ అశ్విన్

  ఎవడే సుబ్రమణ్యం చిత్రంతో దర్శకుడిగా మారిన నాగ అశ్విన్ ఓ సవాల్‌గా స్వీకరించి మహానటిని తెరకెక్కించారు. ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేశారు. సావిత్రి ఇచ్చిన ఇంటర్వ్యూలను, ఇతర నటీనటుల ఇంటర్వూలను చదివారు. రెండో చిత్రంతోనే మహానటి లాంటి చిత్రాన్ని ఆయన నిర్మించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.


  కీర్తి సురేష్ గెటప్స్ కోసం రీసెర్చ్

  కీర్తి సురేష్ గెటప్స్ కోసం రీసెర్చ్

  మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించారు. కీర్తి పాత్రకు సంబంధించిన క్యాస్టూమ్స్‌ను గారంగ్ షా, ఆభరణాలను రాజేష్ సాంగ్లీ డిజైన్ చేశారు. 50 నుంచి 80 దశకాల వాతావరణాన్ని ప్రతిబింబించేలా అభరణాలను, దుస్తులను రూపొందించారు. దాదాపు 100 మంది కళాకారులు ఈ సినిమాకు పనిచేశారు.


   హైలైట్‌గా మాయబజార్ ఎపిసోడ్

  హైలైట్‌గా మాయబజార్ ఎపిసోడ్

  మహానటిలో మాయబజార్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ పేర్కొన్నది. మాయాబజార్ సెట్‌ను అద్భుతంగా వేశారు. శశిరేఖ పాత్రలో సావిత్రిగా కీర్తి సురేష్ అదరగొట్టేసిందని చెప్పుకొంటున్నారు. అహానా పెళ్లంట పాటలో శశిరేఖగా కీర్తి సురేష్, ఘటోత్కచుడిగా మోహన్‌బాబు మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం ఖాయమని చెబుతున్నారు.


   కీలక పాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ

  కీలక పాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ

  మహానటి సావిత్రి జీవితాన్ని ఆవిష్కరించే పాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ నటించారు. వీరి పాత్రలు సినిమాకు ప్రాణంగా పోస్తాయని చిత్ర యూనిట్ పేర్కొన్నది. అలాగే మధురవాణిగా జర్నలిస్టు పాత్రలో సమంత, ఫొటోగ్రాఫర్ విజయ్ ఆంటోనిగా విజయ్ దేవరకొండ నటించారు.


   కేవీరెడ్డిగా దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి

  కేవీరెడ్డిగా దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి

  మహానటి సినిమాలో ఎల్వీ ప్రసాద్‌, కేవీ రెడ్డి పాత్రలు ఎవరు చేస్తున్నారనే అనుమానాలు ఉండేవి, కానీ తాజాగా చిత్ర యూనిట్ ఈ పాత్రలు ఎవరు చేస్తున్నారనేది పోస్టర్స్ ద్వారా చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రముఖ నిర్మాత కేవీ రెడ్డిగా దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి నటిస్తుండటం గమనార్హం.


  అలిమేలుగా మాళవిక

  అలిమేలుగా మాళవిక

  'ఎవడే సుబ్రహ్మణ్యం'‍‌లో హీరోయిన్‌గా తెలుగు పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ మాళవిక‌ 'మహానటి'లో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో జెమినీ గణేశన్ మొదటి భార్యగా, సావిత్రి సవితి పాత్ర 'అలిమేలు'గా మాళవిక నటించింది.


  English summary
  Mahanati, the much-awaited Savitri biopic starring Keerthy Suresh, Dulquer Salmaan, Samantha and Vijay Deverakonda, along with an extensive cast releases on May 9. The film that charts the rise and downfall of the yesteryear actress has caught the attention of many for all the right reasons. Directed by Nag Ashwin, the filmmakers have been busy whipping up curiosity for the film with various kinds of promotions
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more