twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రీమియర్ షో టాక్: 'మహానటి' మహాద్భుతం.. ఆ సన్నివేశాల్లో కీర్తి సురేష్ నటన, విశేషాలు ఇవే!

    |

    Recommended Video

    Mahanati Premier Show Talk

    లెజెండ్రీ నటి, తొలి లేడీ సూపర్ స్టార్ సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం మహానటి. విడుదలకు ముందే ఈ చిత్రం తెలుగువారందరి దృష్టిని ఆకర్షించింది. దానికి కారణం సావిత్రి నటిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేయడమే. ఆమెలా నటించడం, హావభావాలు పలికించడం సావిత్రికి మాత్రమే సాధ్యమైన అంశాలు. దిగ్గజ నటి జీవిత చరిత్రని తెరకెక్కించాలనే ఆలోచన చేసిన దర్శకుడు నాగ అశ్విన్ సావిత్రి జీవితం గురించి క్షుణ్ణమైన అధ్యయనం చేసి మహానటి కథ రూపొందించారు. కీర్తి సురేష్ ని సావిత్రి పాత్రలో నటింపజేయగా, దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్ పాత్రలో నటించాడు. సమంత, విజయ్ దేవరకొండ కీలకపాత్రల్లో నటించారు. నాగ చైతన్య, మోహన్ బాబు, షాలిని పాండే కామియో రోల్స్ లో నటించారు. అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రదర్శించబడిన ప్రీమియర్ షోల నుంచి చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

    అధ్యయనం చేసి రంగంలోకి

    అధ్యయనం చేసి రంగంలోకి

    సావిత్రి జీవిత చరిత్రపై సినిమా అంటే ఏస్థాయిలో అభిమానుల్లో అంచనాలు ఉంటాయో దర్శకుడు నాగ అశ్విన్ గ్రహించాడు. అందుకే సావిత్రి చరిత్రని లోతుగా అధ్యయనం చేసిన తరువాతే నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని ప్రారంభించాడు.

    బ్లాక్ బస్టర్ టాక్

    బ్లాక్ బస్టర్ టాక్

    మహానటి చిత్రం యూఎస్ లో ఇప్పటికే ప్రదర్శించబడుతోంది. యూఎస్ ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత నటన అద్భుతం అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.

    ప్రేమ సన్నివేశాలలో

    ప్రేమ సన్నివేశాలలో

    సావిత్రి పాత్రలో కీర్తి సురేష్, జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ ఒదిగిపోయి నటించారు. ముఖ్యంగా ప్రేమ సన్నివేశాల్లో వీరి మధ్య కెమిస్ట్రీ కన్నుల పండుగలా ఉంది.

    జర్నలిస్టుగా సమంత

    జర్నలిస్టుగా సమంత

    సావిత్రి జీవితాన్ని అధ్యయనం చేసే జర్నలిస్టు మధురవాణిగా సమంత నటించింది. ఫొటోగ్రాఫర్ గా విజయ దేవర కొండ కనిపించాడు.

    ఆశ్చర్యపరిచిన చైతు

    ఆశ్చర్యపరిచిన చైతు

    నాగచైతన్య తన తాతగారు ఎన్నార్ పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచాడు. నాగచైతన్య అచుగుద్దినట్లు అలాగే ఉన్నాడని ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక తెలుగు సినిమా చరిత్రలో లెజెండ్స్ గా చెప్పబడే కెవి రెడ్డి, ఎస్వీ రంగారావు వంటి నటుల పాత్రలని ఈ చిత్రంలో చూడవచ్చు.

    ఫస్ట్ హాఫ్ అలా ముగించాడు

    ఫస్ట్ హాఫ్ అలా ముగించాడు

    దుల్కర్, కీర్తి సురేష్ వివాహ సన్నివేశంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఆ సన్నివేశంలో కీర్తి సురేష్ నటన, హావభావాలు, దుల్కర్ సల్మాన్ తో కెమిస్ట్రీ అద్భుతంగా పండాయి. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి మహానటి బ్లాక్ బస్టర్ చిత్రం అనే అనుభూతి కలుగుతుంది.

    1940, 80 మధ్యకాలంలో

    1940, 80 మధ్యకాలంలో

    సావిత్రి బాల్యం నుంచి ఆమె చరిత్రని చూపించారు. అందుకు తగ్గట్లుగా 1940, 80 నాటి పరిస్థితులని చక్కగా చూపించారు. మరోమారు నిర్మాణ విలువల విషయంలో అశ్విని దత్ తన ప్రత్యేకతని చాటుకున్నారు.

    సెకండ్ హాఫ్ ఎమోషనల్‌గా

    సెకండ్ హాఫ్ ఎమోషనల్‌గా

    సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ గా సాగుతుంది. క్లైమాక్స్ సన్నివేశాల్లో సమంత, కీర్తి సురేష్ తిరుగులేని నటన ప్రదర్శించారు. సావిత్రి జీవితంలో ఎదుర్కొన ఒడిదుడుకులు, వైవాహిక జీవితంలో తలెత్తిన సమస్యలని దర్శకుడు నాగ అశ్విన్ చక్కగా చూపించాడు.

    అంచనాలకు తగ్గట్లుగా

    అంచనాలకు తగ్గట్లుగా

    మొత్తంగా చూసుకుంటే దర్శకుడు నాగ అశ్విన్ సావిత్రి బయోపిక్ ని ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా తెరకెక్కించడంలో వందశాతం విజయం సాధించాడని చెప్పొచ్చు. ఎలాంటి అవాస్తవానికి తావు లేకుండా సావిత్రి జీవితాన్ని నిజాయతీతో చూపించాడు. నటీనటుల ఎంపిక చేసుకోవడం, సావిత్రి హావభావాలని కీర్తి సురేష్ నుంచి రాబట్టుకోవడంలో నాగ అశ్విన్ విజయం సాధించాడు.

    English summary
    Mahanati premier show talk. Mahanati lives upto the expectations
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X