twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మహానటి’... కెవి రెడ్డి, ఎల్వీ ప్రసాద్ పాత్రల పరిచయం అదుర్స్

    By Bojja Kumar
    |

    తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'మహానటి'. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. కేవలం సావిత్రి పాత్రను మాత్రమే కాదు... తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్రవేసిన ఎంతో మంది ప్రముఖుల పాత్రలను ఈ చిత్రంలో మనం చూడబోతున్నాం. మే 9న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ వినూత్నంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు చిత్ర బృందం. తాజాగా కెవి రెడ్డి, ఎల్వీ ప్రసాద్ పాత్రలను పరిచయం చేస్తూ వీడియో ప్రోమో విడుదల చేశారు.

    ఎల్వీ ప్రసాద్ పాత్రలో అవసరాల శ్రీనివాస్

    ఈ చిత్రంలో ఎల్వీ ప్రసాద్ పాత్రలో అవసరాల శ్రీనివాస్ నటించారు. నాని వాయిస్ ఓవర్‌తో ఎల్వీ ప్రసాద్ పాత్రకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ‘అనగనగా ఏలూరుకు చెందిన 22 ఏళ్ల కుర్రాడు. తొలి భారతీయ టాకీ ఆలం అరా, తొలి తెలుగు సినిమా ‘భక్తప్రహ్లాద'లోనూ నటించేశారు. అదే గుండెధైర్యంతో మద్రాసు తిరిగొచ్చి దర్శకుడిగా మనదేశం, షావుకారు, పెళ్లిచేసి చూడు, మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు వంటి ఎన్నో ఆణిముత్యాలను మనకు అందించారు. ఆయనే ఎల్వీ ప్రసాద్‌ రావు గారు' అంటూ ఈ వీడియో రిలీజ్ చేశారు.

    కెవి రెడ్డి పాత్రలో క్రిష్

    ఈ చిత్రంలో కెవి రెడ్డి పాత్రలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నటించారు. ‘టీవీ, ఇంటర్నెట్‌, కంప్యూటర్‌లాంటి స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ ఉన్న ఈ రోజుల్లో ఎన్నైనా చేయొచ్చు. కానీ ఆరవై ఐదేళ్ల క్రితం ఇవేవీ లేనప్పుడు.. ‘మాయాబజార్‌'లో ల్యాప్‌టాప్‌ విత్‌ స్కైప్‌ను ఆరోజుల్లో ‘ప్రియదర్శిన్‌'గా చూపించిన ఓ మాయల ఫకీరు ఉన్నాడు. ఆయనే గ్రేట్‌ విజనరీ కేవీ రెడ్డిగారు. ‘పాతాళ భైరవి', ‘భక్తపోతన', ‘దొంగరాముడు' వంటి అద్భుతమైన చిత్రాలను తెలుగు సినిమా గగనంలో ఎగరవేసిన సృజనాత్మక దర్శకుడు కేవీ రెడ్డి. అలాంటి దర్శకుడ్నే తన అభినయంతో నివ్వెరపోయేలా చేసిన మహానటి సావిత్రి. ఆ శశిరేఖను కన్న బలరాముడికంటే ఈ సావిత్రిని శశిరేఖగా ప్రేక్షకులకు అందించిన కేవీ రెడ్డి ఘనుడు. మరి కేవీ రెడ్డి పాత్రను ఎవరు పోషించారో తెలుసా?మన క్రిష్‌ జాగర్లమూడి' అంటూ ప్రోమో విడుదల చేశారు.

    సినిమాపై పెరుగుతున్న అంచనాలు

    సినిమాపై పెరుగుతున్న అంచనాలు

    సావిత్రి సినిమాలోని ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ సినిమాపై అంచనాలు మరింత పెంచేలా చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్, జెమినీ గణేశన్‌ పాత్రలో దుల్కర్ సల్మాన్‌ను, ఏఎన్నార్ పాత్రలో నాగచైతన్య, ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు షాలినీ పాండే, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, భానుప్రియ, దివ్యవాణి తదితరులు ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నారు.

    సమంత, విజయ్ దేవరకొండ పాత్రలు

    సమంత, విజయ్ దేవరకొండ పాత్రలు

    ఈ చిత్రంలో జర్నలిస్టు మధురవాణిగా సమంత, ఆమె వెంట ఉండే ఫోటోగ్రాఫర్ విజయ్ ఆంటోనీ పాత్రలో విజయ్ దేవకొండ నటించారు. సావిత్రి గురించి రీసెర్చ్ చేసే పాత్రలో వీరు నటించారు. సినిమాలో వీరి పాత్రల ద్వారానే సావిత్రి జీవితం ప్రేక్షకులకు నేరేట్ చేయనున్నారు.

    ఎక్కడా కాంప్రమైజ్ కాని నిర్మాతలు

    ఎక్కడా కాంప్రమైజ్ కాని నిర్మాతలు

    ‘మహానటి' చిత్రాన్ని వై జయంతి మూవీస్, స్వప్న సినిమాస్ పతాకంపై స్వప్నదత్, ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఈ సినిమా కోసం దాదాపు 2 వేలకు పైగా ఆర్టిస్టులను ఆడిషన్ చేశారు. అందులో నుండి సినిమాలోని పాత్రలకు తగిన నటీనటులను ఎంపిక చేశారు. ప్రముఖ టెక్నీషియన్స్, వందలాది కాస్టూమ్స్, సావిత్రి కాలానికి సంబంధించిన పరిస్థితులు కళ్లకు కట్టేలా 32 సెట్స్ ఈ సినిమా కోసం వేశారు.

    మహానటి

    మహానటి

    ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ప్రొడక్షన్ డిజైన్: శివం, ఆర్ట్: అవినాష్, కాస్ట్యూమ్స్: గౌరాంగ్, అర్చన, స్టైలిస్ట్: ఇంద్రాక్షి, కెమెరా: డాని, కళా నేతృత్వం: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, దర్శకత్వం: నాగ అశ్విన్, నిర్మాత: ప్రియాంక దత్.

    English summary
    Mahanati movie new promos released. Krish as KV Reddy and Avasarala as LV Prasad seen in this promo videos. The movie Starring #KeerthySuresh, #VijayDevarakonda, #DulquerSalmaan , #SamanthaAkkineni and Others. Music Composed By #MickeyJMeyer, Directed by #NagAshwin and Produced by Aswani Dutt, Priyanka Dutt and Swapna Dutt. Under the banner of Vyjayanthi Movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X