మహానటి: ఫిల్మ్ జర్నలిస్ట్ మధురవాణిగా సమంత
ప్రముఖ తెలుగు నటి సావిత్రి జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'మహానటి' టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్ సావిత్రి రోల్ చేస్తోంది. అయితే ఇందులో మరో టాప్ హీరోయిన్ సమంత కూడా నటిస్తుండటంతో ఆమె ఎవరి పాత్రలో కనిపిస్తుందనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత ప్రముఖ నటి జమునగా కనిపించబోతోందనే వార్తలు గతంలో వినిపించాయి. కానీ ఈ పాత్ర పోషిస్తున్నది శాలిని పాండే అని తాజా సామాచారం.

చిత్ర యూనిట్ అఫీషియల్‌గా వెల్లడించిన వివరాల ప్రకారం సమంత ఇందులో ఫిల్మ్ జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో కనిపించబోతున్నారు. సావిత్రి మీద జర్నల్ రాసే జర్నలిస్టుగా సమంత నేరేషన్‌తో 'మహానటి' చిత్రం మొదలవుతుందని టాక్. ఆమె తన జర్నల్ గురించి చెప్పే క్రమంలోనే సినిమా రన్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు.

వై జయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్, టీజర్ విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











