‘మహానటి’కి భారీ దెబ్బ..... ఏం చేయాలో అర్థంకాక తలపట్టుకున్న నిర్మాతలు!

By Bojja Kumar

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మహానటి' సినిమాకు భారీ దెబ్బ తగిలింది. తెలుగు, తమిళంలో విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతున్న ఈ సినిమాపై పైరసీ భూతం విరుచుకుపడింది. 'మహానటి' తమిళ వెర్షన్ 'నడిగైయార్ తిలగమ్' పేరుతో విడుదల కాగా.... పూర్తి సినిమా ఆన్ లైన్లో లీక్ అయింది. దీంతో సినిమా కలెక్షన్లపై భారీగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

తెలుగు వెర్షన్‌పై ప్రభావం

తెలుగు వెర్షన్‌పై ప్రభావం

లీకైంది తమిళ వెర్షన్ అయినప్పటికీ తెలుగు వెర్షన్ వసూళ్లపై పై కూడా ఈ ప్రభావం ఉంటుందని, ప్రపంచ వ్యాప్తంగా సినిమా కలెక్షన్స్ ఎఫెక్ట్ అవుతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. చిత్ర నిర్మాతలు పైరసీ విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలా జరిగిందని టాక్.

ఎన్ని చర్యలు తీసుకున్నా..

ఎన్ని చర్యలు తీసుకున్నా..

పైరసీ సమస్య చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీని వెంటాడుతైనే ఉంది. ఇంటర్నెట్ వాడకం విస్తృతం అయిన తర్వాత పెద్ద హీరోల సినిమాలు సైతం విడుదలైన మరుసటిరోజే ఆన్ లైన్లో దర్శనమిస్తున్నాయి. దీన్ని నివారిచండానికి ఎన్ని చర్యలు తీసుకున్నా ఏదో ఒక రకంగా మళ్లీ విజృంచి పరిశ్రమను తీవ్రంగా నష్టపరుస్తూనే ఉన్నాయి.

రోజు రోజుకు పెరుగుతున్న వసూళ్లు

రోజు రోజుకు పెరుగుతున్న వసూళ్లు

కాగా, మహానటి మూవీ కలెక్షన్ల విడుదలైన అన్ని చోట్లా సంతృప్తి కరంగా ఉన్నాయి. సినిమా ఓపెనింగ్స్ సాధారణంగా ఉన్నప్పటికీ పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో రోజు రోజుకు కలెక్షన్లు పుంజుకుంటున్నాయి.

యూఎస్ఏలో మంచి ఆదరణ

యూఎస్ఏలో మంచి ఆదరణ

యూఎస్ఏలో ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో $854K (రూ. 5.75 కోట్లు ) వసూలు చేసింది. వీకెండ్ పూర్తయ్యే సమాయానికి ఓవరాల్ కలెక్షన్ 1 మిలియన్ మార్కను అధిగమించనుంది. 2018లో విడుదలైన చిత్రాల్లో రంగస్థలం, భరత్ అనే నేను, అజ్ఞాతవాసి, భాగమతి, తొలిప్రేమ చిత్రాల తర్వాతి స్థానంలో ‘మహానటి' నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X