మహానటి డబ్‍స్మాష్ కాంటెస్ట్... స్పెషల్ గిఫ్ట్ ఇస్తానంటున్న సమంత!
ప్రముఖ తెలుగు నటి సావిత్ర జీవితంగా 'మహానటి' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మే 9న సినిమా విడుదలవుతున్న నేపత్యంలో ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇందులో భాగంగా మహానటి డబ్ స్మాష్ కాంటెస్ట్ మొదలు పెట్టారు. మాయా బజార్ చిత్రంలో 'అహ నా పెళ్లి అంట' అనే పాటకు సావిత్రి నర్తించినట్లుగా డబ్ స్మాష్ వీడియో చేసి ఫేస్ బుక్, ట్విట్టర్, డబ్ స్మాష్‌లో పోస్టు చేస్తే అందులో ది బెస్ట్ డబ్ స్మాష్ వీడియోలు సెలక్ట్ చేసి వారికి ప్రత్యేకంగా బహుమతులు ఇవ్వనున్నారట. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సమంత ఓ వీడియో పోస్టు చేశారు.
టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం మహానటి. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రియాంక దత్ నిర్మాత.
ఈ చిత్రంలో సమంత ఫిల్మ్ జర్నలిస్టు పాత్రలో కనిపించబోతున్నారు. ఆమె వెంట ఉండే ఫోటోగ్రాఫర్ పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఇంకా దుల్కర్ సల్మాన్, శాలిని పాండే, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ప్రొడక్షన్ డిజైన్: శివం, ఆర్ట్: అవినాష్, కాస్ట్యూమ్స్: గౌరాంగ్, అర్చన, స్టైలిస్ట్: ఇంద్రాక్షి, కెమెరా: డాని, కళా నేతృత్వం: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, దర్శకత్వం: నాగ అశ్విన్, నిర్మాత: ప్రియాంక దత్.


Click it and Unblock the Notifications











