‘మహంకాళి’ రిలీజ్ డేట్ ఖరారు

By Bojja Kumar

హైదరాబాద్: రాజశేఖర్, మధురిమ జంటగా నటించిన 'మహంకాళి' చిత్రం డిసెంబర్ 7న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలలో ఒకరైన వై.సురేంద్రరెడ్డి మాట్లాడుతూ... పేరులోనే కాదు తన వృత్తిలో కూడా ఓ పోలీసు అధికారి ఎంత పవర్ ఫుల్ గా కనిపించాడన్న అంశాన్ని 'మహంకాళి' చిత్రంలో చూడాల్సిందేనని అన్నారు. జీవితరాజశేఖర్ దర్శకత్వంలో అంజేరి ఆర్ట్స్ పతాకంపై వల్లభనేని అశోక్ సమర్పణలో వై.సురేందర్ రెడ్డి, ఎ.పరంధామరెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది.

ఈ చిత్ర విశేషాలను సురేందర్ రెడ్డి వివరిస్తూ... రాజశేఖర్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయే చిత్రమిదని, గతంలో పోలీసు పాత్రలలో అద్వితీయమైన నటనను కనబరిచిన రాజశేఖర్ ఈచిత్రంలోని తన పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసారని అన్నారు. ప్రేక్షకుల మనసుకు హత్తుకునే విధంగా ఈచిత్రం మలచబడిందని చెప్పారు. ఎంతో రిస్క్ చేసి, రాజశేఖర్ చేసిన ఫైట్స్ తో పాటు పాటలు, సన్నివేశాలు వంటివన్నీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయన్నారు.

ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ప్రదీప్ రావత్, చలపతిరావు, అభినయ, సత్య ప్రకాష్, అన్నపూర్ణమ్మ, జీవా, ప్రభాకర్, నళిని, వినోద్ కుమార్, కాదంబరి కిరణ్, రఘు, సుత్తివేలు, నర్సింగ్ యాదవ్, భరత్, ప్రసన్న కుమార్, శేఖర్, భాషా, ప్రభావతి తదితరులు తారాగణం.

ఈ చిత్రానికి మాటలు రాజశేఖర్, కృష్ణ మోహన్, పాటలు: సుద్దాల అశోక్ తేజ, సాహిత్య సాగర్, పైడిశెట్టి రాము, సంగీతం: చిన్నా, ఛాయాగ్రహణం: మధు.ఎ నాయుడు, ఫైట్స్: కనల్ కన్నన్, మార్షల్ రమణ, కొరియోగ్రఫీ: అమ్మ రాజశేఖర్, రాక్ నాని, సమర్పణ: వల్లభనేని అశోక్, నిర్మాతలు: వై.సురేందర్ రెడ్డి, ఎ.పరంధామరెడ్డి, స్క్రీన్ ప్లే: డా.వి.రాజశేఖర్, దర్శకత్వం: జీవిత రాజశేఖర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X