ఎట్టకేలకు రాజశేఖర్ ‘మహంకాళి’ రిలీజ్
హైదరాబాద్: అప్పుడెప్పుడో 2010 అక్టోబర్లో ప్రారంభమైన రాజశేఖర్ 'మహంకాళి' మూవీ దాదాపు రెండున్నరేళ్ల అనంతరం రిలీజ్‌కు సిద్ధమైంది. రాజశేఖర్ సరసన మధురిమ హీరోయిన్ గా నటించిన ఈచిత్రాన్ని మార్చి 2న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా ప్రారంభమైన తొలినాళ్లలో ఈ చిత్రానికి కార్తికేయను దర్శకుడిగా నియమించారు. అయితే కొంత కాలం తర్వాత ఈ సినిమా నుంచి కార్తికేయ తప్పుకోవడంతో రాజశేఖర్ భార్య జీవిత ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా గురించి దర్శకురాలు జీవిత మాట్లాడుతూ.... 'నేటి సమకాలిన సంఘాలను కథా వస్తువుగా చేసుకుని తీసిన చిత్రమిది. మేము చిత్రీకరించిన కొన్ని సంఘటనలు సమాజంలో నిజంగానే జరిగాయి. పోలీసు పాత్రలకు పెట్టింది పేరైన రాజశేఖర్ ఈచిత్రంలో కూడా తన పాత్రకు జీవం పోసారు' అని తెలిపారు. ఈ నెల 17న ట్రైలర్ విడుదల చేసి, మార్చి 2న సినిమా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు సురేందర్ రెడ్డి, పరంధామరెడ్డిలు తెలిపారు.
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ప్రదీప్ రావత్, చలపతిరావు, అభినయ, సత్య ప్రకాష్, అన్నపూర్ణమ్మ, జీవా, ప్రభాకర్, నళిని, వినోద్ కుమార్, కాదంబరి కిరణ్, రఘు, సుత్తివేలు, నర్సింగ్ యాదవ్, భరత్, ప్రసన్న కుమార్, శేఖర్, భాషా, ప్రభావతి తదితరులు తారాగణం.
ఈ చిత్రానికి మాటలు రాజశేఖర్, కృష్ణ మోహన్, పాటలు: సుద్దాల అశోక్ తేజ, సాహిత్య సాగర్, పైడిశెట్టి రాము, సంగీతం: చిన్నా, ఛాయాగ్రహణం: మధు.ఎ నాయుడు, ఫైట్స్: కనల్ కన్నన్, మార్షల్ రమణ, కొరియోగ్రఫీ: అమ్మ రాజశేఖర్, రాక్ నాని, సమర్పణ: వల్లభనేని అశోక్, నిర్మాతలు: వై.సురేందర్ రెడ్డి, ఎ.పరంధామరెడ్డి, స్క్రీన్ ప్లే: డా.వి.రాజశేఖర్, దర్శకత్వం: జీవిత రాజశేఖర్.


Click it and Unblock the Notifications











