బూతు డాన్స్ కేసులో...మల్లికా శెరావత్
బాలీవుడ్ శృంగార నటి మల్లికా శెరావత్‌పై మహారాష్ట్ర న్యాయస్థానం అరెస్ట్ వారెంటు జారీచేసింది. ఆమె అశ్లీల నృత్యం చేశారనే అభియోగాలపై నమోదైన కేసులో ఈ నెల 16వ తేదీన న్యాయస్థానంలో హాజరవ్వాలని ఆదేశించింది. మల్లిక అశ్లీల నృత్యానికి సంబంధించి ఫిర్యాదు చేశానని, ఇందుకు సంబంధించిన సీడీలు, ఫొటోలు పంధక్వాడా జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌కు సమర్పించానని ఫిర్యాదుదారుడు రజనీకాంత్ బొరేలే తెలిపారు. మల్లిక న్యాయస్థానంలో హాజరవ్వాల్సిందిగా గతేడాది ఏప్రిల్‌లో న్యాయస్థానం సమన్లు జారీచేసింది. న్యాయస్థానంలో హాజరయ్యేందుకు తన కక్షిదారుకు కొంత సమయం కావాలంటూ మల్లిక తరఫు న్యాయవాది కోరారు. ఈ అభ్యర్థనను మన్నించిన న్యాయస్థానం రెండు దఫాలు సమయమిచ్చి విచారణ చివరిరోజైన శనివారం నాడు వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఆదేశించింది.అయినా, శనివారం మల్లిక న్యాయస్థానానికి హాజరవలేదు. ఈ విషయాన్ని ఫిర్యాదుదారుడు న్యాయస్థానానికి నివేదించడంతోపాటు.. వారెంటు జారీ చేయాలని కోరాడు. దీంతో, పంధక్వాడా జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ సునీల్ బొరల్కర్ మల్లికపై బెయిలుకు వీలైన వారెంటు జారీచేశారు.


Click it and Unblock the Notifications











