మనో భావాలు దెబ్బతీసారంటూ...సల్మాన్‌పై కేసు
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌పై మరో కేసు నమోదైంది. ఈ సారి ఆయనపై మతం మనోభావాలు దెబ్బతీసారనే పిర్యాదులు రావడంతో మహారాష్ట్ర పోలీసులు ఆయనపై 295(ఎ) సెక్షన్ కింద కేసు నమోదు చేసారు. ఆలిండియా క్వామీ తంజీమ్ విదర్భ యూనిట్ ప్రెసిడెంట్ అసిమ్ అలీ ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన ఎన్జీవో ‘బీయింగ్ హ్యూమన్' సంస్థ కొన్ని నెలల క్రితం ముంబైలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో కొందరు మోడల్స్ ధరించిన గౌనుపై అరబిక్ బాషల్ ‘అల్లా' అని రాసి ఉందని, వారి చర్య ముస్లిం మనోభావాలు దెబ్బతీసేలా ఉందని అలీ తన కంప్లైంట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
\

అలీ తన కంప్లయింటుతో పాటు ఫ్యాషన్ షోకు సంబంధించిన వీడియో క్లిప్‌ను కూడా జత చేసినట్లు తెలుస్తోంది. సదరు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందని అలీ తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం లేదని అలీ ఆరోపించారు. కంప్లైంట్ ఇచ్చి రెండు రోజులైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అలీ తెలిపారు. పోలీసులు డ్రామా ఆడుతున్నారని, రెండు రోజుల క్రితం కంప్లైంట్ ఇస్తే ఈ రోజు ఉదయం కేసు నమోదు చేసారని తెలిపారు. అయితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దిలీప్ చవాన్ మాట్లాడుతూ...తాము సదరు కంప్లైంట్‌కు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.


Click it and Unblock the Notifications











