twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ డిజాస్టర్స్ మూవీ.. 13ఏళ్ళైనా ఇంకా అప్పులు తీరలేదు: నిర్మాత ఆవేదన

    |

    సినిమా పరిశ్రమలో అపజయాలు అనేవి జస్ట్ కామన్ అని సీగాల మంది అనుకుంటారు. కానీ కొన్నిసార్లు ఆ ఫెయిల్యూర్స్ మిగిల్చే నష్టాలు కోలుకోలేని విధంగా ఉంటాయి. ముఖ్యంగా నిర్మాతల పరిస్థితి కొన్నిసార్లు చాలా దారుణంగా ఉంటుంది. ఒకప్పుడు బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న వారు కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడింది. ఇక కొందరైతే ఏళ్ళు గడిచిన చేసిన అప్పులకు ఇంకా వడ్డీలు కడుతూనే ఉన్నారు. అదే తరహాలో బాలకృష్ణతో ఒక సినిమాను నిర్మించిన నిర్మాత కూడా ఇంకా అప్పుల బాధ నుంచి బయటపడలేదట.

    చంద్రముఖి దర్శకుడి వల్ల భారీ హైప్

    చంద్రముఖి దర్శకుడి వల్ల భారీ హైప్

    బాలకృష్ణ కెరీర్ లో విజయాలతో పాటు భారీ డిజాస్టర్స్ కూడా ఎన్నో ఉన్నాయి. అందులో మహారధి ఒకటి. తమిళ్ దర్శకుడు పి. వాసు డైరెక్ట్ చేసిన ఆ సినిమా ఎనౌన్స్ చేసినప్పుడు అంచనాలు భారిగా పెరిగిపోయాయి. ఎందుకంటే అప్పుడు దర్శకుడు వాసు చంద్రముఖి సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ అందున్నాడు. ఇక బాలకృష్ణ లాంటి మాస్ హీరోతో వర్క్ చేస్తుండడంతో మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

    సినిమాను నిర్మించింది ఆయనే

    సినిమాను నిర్మించింది ఆయనే

    ఇక మహారథి సినిమాను వాకాడా అప్పారావు నిర్మించాడు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ తెలుగులో నిర్మించే సినిమాలకు అప్పట్లో ఎక్స్ క్యూటివ్ నిర్మాతగా ఉన్నది ఈయనే. ఆర్.బి.చౌదరి కొన్నిసార్లు తమిళ్ సినిమాలతో బిజీగా ఉండడం వలన తెలుగు సినిమాలపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోయేవారు. అందుకే వాకాడా అప్పారావును ఎక్స్ క్యూటివ్ నిర్మాతగా ఉంచి సినిమా మేకింగ్ నుంచి విడుదల వరకు అన్ని పనులను ఆయనకే అప్పగించేవరు.

    సినిమా కోసం భారీగా అప్పులు

    సినిమా కోసం భారీగా అప్పులు

    ఇక సూపర్ గుడ్ ఫిల్స్మ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తరువాత నిర్మాతగా మారాలని అనుకున్న అప్పారావు బాలకృష్ణతో సినిమా చేయాలని అనుకున్నాడు. ఇక పి.వాసు, రచయిత మధుతో కలిసి కథను సెట్ చేయించి షూటింగ్ స్టార్ట్ చేశారు. కానీ ఫైనాన్సర్స్ సడన్ గా మధ్యలో చేతులెత్తేయడంతో అప్పారావుకుకి చాలా కష్టమైందట. వేరే వాళ్ళ దగ్గర లక్ష నుంచి 10లక్షల వరకు కూడా అప్పులు తీసుకొచ్చి సినిమాకు పెట్టారట.

    Recommended Video

    Nandamuri Mokshagna Is Not Ready Yet, Latest Look Goes Viral
    13ఏళ్ళైనా ఇంకా ఆ అప్పులు తీరలేదు

    13ఏళ్ళైనా ఇంకా ఆ అప్పులు తీరలేదు

    ఫైనల్ గా ఒక వ్యక్తి ద్వారా బ్యాంక్ లో 4కోట్లు లోన్ తీసుకొని అతికష్టం మీద సినిమాను రిలీజ్ చేయాల్సి వచ్చిందట. 2007లో విడుదలైన ఆ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం నేను ఎక్కువగా సినిమా గురించి పట్టించుకోకందా ఫైనాన్సర్స్ వెంట తిరగడమేనని అప్పారావు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. ఇక 13ఏళ్ళైనా కూడా ఇంకా ఆ సినిమా కోసం చేసిన అప్పులు తిరలేదని వాటిని ఇంకా కడుతూనే ఉన్నానని కూడా ఈ సీనియర్ నిర్మాత వివరణ ఇచ్చారు.

    English summary
    Boyapati Srinivas is coming up with the next Nandamuri Balakrishna movie. Since then, there has been a dose of anticipation among fans that Balakrishna will be appearing in the new gateways as never before. But even when the budget figures are down, the director is not slowing down. This is not a Baahubali movie as the budget figures are rising .. Ballaya Movie is coming up with comments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X