twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విడుదల ముందే ‘మహర్షి’ స్టోరీ లీక్, కథలో ఊహించని ట్విస్టులు..

    |

    Recommended Video

    Maharshi Movie Story Is Out || Filmibeat Telugu

    మహేష్ బాబు హీరోగా రూపొందిన 'మహర్షి' చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్న అభిమానుల కోరిక మరికొన్ని గంటల్లో తీరబోతోంది. సూపర్ స్టార్‌కు ఇది 25వ ల్యాండ్ మార్క్ మూవీ మాత్రమే కాదు...తన కెరీర్లోనే ది బెస్ట్ స్టోరీ అవుతుందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.

    ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ విషయంలో గతంలో రకరకాల ప్రచారం జరిగింది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాత మరో కథనం ప్రచారంలోకి వచ్చింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో పోల్చి చూస్తే ఇదే అసలైన కథ అనే దానికి మరింత బలం చేకూరుతోంది.

    యూఎస్ఏ సన్నివేశాలతో సినిమా షూరూ?

    యూఎస్ఏ సన్నివేశాలతో సినిమా షూరూ?

    ‘మహర్షి'లో మహేష్ బాబు మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాలేజీ స్టూడెంటుగా, కంపెనీ సీఈఓగా, రైతుగా కనిపించబోతున్నాడు. కథ యూఎస్ఏలో ప్రారంభం అవుతుందని, సీఈఓ పాత్రలో బిజినెస్‌మేన్‌గా రిషి పాత్రలో హీరో ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. అతడి సెక్రటరీ పాత్రలో మీనాక్షి దీక్షిత్ కనిపిస్తుందట.

    అతడి లక్ష్యం బాగా డబ్బు సంపాదించడమే

    అతడి లక్ష్యం బాగా డబ్బు సంపాదించడమే

    యూఎస్ఏలో జర్నలిస్టులతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో రిషి తన సక్సెస్ గురించి చెబుతూ...తాను ఎక్కడ మొదలయ్యాను, ఇక్కడి వరకు ఎలా వచ్చాను అనే వివరాలు వెల్లడించే క్రమంలో కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుందట. మొదట్లో రైతుల సమస్యలు చూసినా పెద్దగా పట్టించుకోని మనస్తత్వంతో రిషి పాత్ర సాగుతుందట. అతడి లక్ష్యం బాగా డబ్బు సంపాదించి పెద్ద ధనవంతుడు కావడమే.

    నరేష్ పాత్ర కీలకంగా...

    నరేష్ పాత్ర కీలకంగా...

    నరేష్ ఒక రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిగా చిత్రంలో కనిపించబోతున్నాడని, తన కాలేజీ స్నేహితుడైన రిషి(మహేష్)ని సెలవులకు తమ ఊరు ఆహ్వానిస్తాడని, అదే సమయంలో నరేష్ ఫ్యామిలీ గ్రామ పెద్దతో కొన్ని సమస్యలు ఎదుర్కొంటుందని, మహేష్ వారి కోసం ఫైట్ చేస్తారని, మహేష్ బాబు గ్రామం వదిలి వెళ్లిన తర్వాత నరేష్ కుటుంబం సూసైడ్ చేసుకుటుందని... తెలుస్తోంది

    ఉద్యోగం చేయడానికి ఇష్టపడని పాత్రలో...

    ఉద్యోగం చేయడానికి ఇష్టపడని పాత్రలో...

    ఇది కేవలం తమ కుటుంబ సమస్య కాదని, అందరి రైతుల సమస్య అని రిషికి వెల్లడించడంతో పాటు గ్రామంలో ఉండి రైతులకు సహాయం చేయాలని నరేష్ కోరతాడట. అయితే రిషి లక్ష్యం అది కాదని, గ్రామంలో ఉండటానికే కాదు... అసలు ఇండియాలోనే ఉద్యోగం చేయడానికి ఇష్టపడని అతడు బాగా డబ్బు సంపాదించడం కోసం అమెరికా వెళ్లిపోతాడట.

    సినిమా చూసి నాన్న భుజం తట్టారు.. జీవితంలో మరిచిపోలేను.. మహేష్ బాబుసినిమా చూసి నాన్న భుజం తట్టారు.. జీవితంలో మరిచిపోలేను.. మహేష్ బాబు

    నరేష్ పాత్ర చనిపోతుందా?

    నరేష్ పాత్ర చనిపోతుందా?

    మహేష్ బాబు తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం పూర్తయిన తర్వాత ఇండియాలో ఉండే పూజా హెగ్డేకు ఫోన్ చేస్తాడని, నరేష్ గురించి వాకబు చేయగా...నరేష్ చంపబడ్డాడని ఆమె చెప్పడంతో మహేష్ బాబు రియలైజ్ అవుతాడని, తాను తప్పు చేశానని భావించి ఇండియా వస్తాడని... తర్వాత రైతులకు హెల్ప్ చేసే క్రమంలో సెకండాఫ్ స్టోరీ సాగుతుందని సమాచారం.

    మహర్షి U/A

    మహర్షి U/A

    మహర్షి చిత్రం ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డ్ నుంచి U/A సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. సినిమా టోటల్ రన్ టైమ్ 179 నిమిషాలు(2 గంటల 59 నిమిషాలు). యూత్, ఫ్యామిలీ ఆడియన్స్, అభిమానులు మెచ్చేలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు వంశీ పైడిపల్లి.

    మహర్షి

    మహర్షి

    మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి' తెరకెక్కుతోంది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటిస్తుండగా... అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు..

    English summary
    The story of Mahesh Babu's 25th movie Maharshi, directed by Vamshi Paidipally, has been reportedly leaked. The movie all set to get released on May 9th. The movie was produced on a large scale by Dil Raju, Ashwini Dutt and PVP Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X