క్రేజీ న్యూస్: పవన్ కళ్యాణ్‌ని పక్కకు తోసేసిన మహేష్ బాబు! రికార్డు బ్రేక్ చేస్తూ..
మహేష్ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి హంగామా బాగా సాగుతోంది. చిత్రంలో రైతు నేపథ్యంలో చూపిన సన్నివేశాలు, పలు సామాజిక అంశాలు హైలైట్ అవుతున్నాయి. ఓ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టిన ఈ సినిమా ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ దాటేసి 200 కోట్ల మార్క్‌కి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవలే విజయవాడలో గ్రాండ్ సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు మేకర్స్. వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మహేష్ బాబు మరపురాని అభినయం కనబర్చారు. దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వీ పొట్లూరి లాంటి బడా నిర్మాతలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా.. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు.
మహేష్ 25 వ సినిమా కావడంతో విడుదలకు ముందే మహర్షిపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఆకాశాన్నంటే అంచనాల నడుమ మే 9 వ తేదీన ఈ సినిమా విడుదలైంది. మొదటి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని వేగంగా కలెక్షన్స్ రాబట్టింది మహర్షి. ఈ నేపథ్యంలో పలు రికార్డులకు చెరిపేస్తూ ప్రభంజనం సృష్టిస్తోంది మహర్షి మూవీ. తాజగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఉత్తమ సినిమాగా రికార్డు నెలకొల్పిన అత్తారింటికి దారేది రికార్డుకు బద్దలు కొట్టేసింది.

వసూళ్ల పరంగా నైజాంలో ఈ చిత్రం నాలుగోస్థానంలో నిలిచింది. నైజాంలో బాహుబలి 1 రూ.68 రూపాయలను, బాహుబలి 2 రూ.42 కోట్ల రూపాయలను, రామ్‌చరణ్ రంగస్థలం 27కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టగా.. దాని తర్వాత స్థానంలో మహేష్ మహర్షి సినిమా నిలిచింది. గతంలో నైజాం కలెక్షన్స్ పరంగా పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది 23.45 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని రీప్లేస్ చేస్తూ మహర్షి నాలుగో స్థానం చేజిక్కించుకోవడం విశేషం. మొత్తంగా చూస్తే ఇప్పటికీ దేశంలో మహర్షి కలెక్షన్స్ భారీగానే నమోదవుతున్నాయి.


Click it and Unblock the Notifications











