twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మహర్షి’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది, అదిరిపోయే సోషల్ థ్రిల్లర్.. రేటింగ్ 4/5

    |

    Recommended Video

    #Maharshi Movie First Review || Filmibeat Telugu

    మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మహర్షి'. సూపర్ స్టార్ కెరీర్లో 25వ ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో ముందు నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ట్రైలర్ రిలీజ్ తర్వాత ఎక్స్‌పెక్టేషన్స్ మరింత ఎక్కువయ్యాయి. సినిమా బ్లాక్ బస్టర్ విజయం ఖాయం అనే టాక్ ఇప్పటికే స్ప్రెడ్ అయింది. హిట్ సినిమాలను అంచనా వేయడంలో ఎక్స్‌పర్ట్ అయిన దిల్ రాజు సైతం ఈ సినిమా తాను ఊహించని స్థాయిలో విజయం సాధిస్తుందని, ఫ్యాన్స్ ఎంత ఎక్కువ అంచనాలు పెట్టుకున్నా దాన్ని రీచ్ అయ్యే కెపాసిటీ ఉన్న బొమ్మ అని చెప్పడంతో... టాలీవుడ్లో ఈ వారం బిగ్ బ్లాక్ బస్టర్ బెల్ మ్రోగబోతోందనే విషయంపై అందరిలోనూ ఓ క్లారిటీ వచ్చింది. తాజాగా యూఏఈ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు నుంచి కూడా 'మహర్షి' మూవీ విషయంలో సూపర్ పాజిటివ్ రివ్యూ వచ్చేసింది.

    ‘మహర్షి’ అద్భుతమై సినిమా

    ‘మహర్షి’ అద్భుతమై సినిమా

    యూఎఈలో సెన్సార్ కాపీ చూసి అనంతరం ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. ‘మహర్షి' మూవీ అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న అద్భుతమైన సినిమా. తీరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంది అంటూ పొగడ్తలు గుప్పించాడు. ఉమైర్ సంధు ట్వీట్ చూస్తుంటే ‘మహర్షి' కథ ప్రేక్షకులను కట్టి పడేసే విధంగా ఉంటుందని, స్క్రీన్ ప్లే వినోదాత్మకంగా ఉంటుందని తెలుస్తోంది.

    మహేష్ బాబును చూసి ఫిదా అవ్వాల్సిందే

    మహేష్ బాబును చూసి ఫిదా అవ్వాల్సిందే

    ఈ చిత్రంలో మహేష్ బాబు మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. కాలేజీ కుర్రాడిగా, కంపెనీ సీఈఓగా, ఆ తర్వాత రైతుగా విభిన్నమైన పాత్రల్లో ప్రేక్షకులను అలరించబోతున్నారు. నటన పరంగా, లుక్ పరంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే విధంగా మహేష్ బాబు పెర్పార్మెన్స్ ఉందని ఉమైర్ సంధు తన రివ్యూలలో పేర్కొన్నారు.

    ఎంగేజింగ్ సోషల్ థ్రిల్లర్

    ఎంగేజింగ్ సోషల్ థ్రిల్లర్

    దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమా కోసం ఎంచుకున్న సబ్జెక్ట్ ఎంతో అద్భుతంగా ఉందని, అందరికీ కనెక్ట్ అయ్యే ఎంగేజింగ్ సోషల్ థ్రిల్లర్ అంటూ ఉమైర్ సంధు పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే కథలో ఎంతో డెప్త్ ఉన్న విషయం స్పష్టమవుతోంది.

    పూజా హెగ్డే స్టన్నింగ్

    పూజా హెగ్డే స్టన్నింగ్

    హీరోయిన్ పూజా హెగ్డే తన స్టన్నింగ్ లుక్, గ్లామరస్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిందని ఉమైర్ సంధు తెలిపారు. ఇందులో అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తన ట్వీట్లో ఉమైర్ సంధు అతడి ప్రస్తావన తేక పోవడం గమనార్హం. అయితే చిత్ర బృందం మాత్రం నరేష్ రోల్ కథలో బాగా హైలెట్ అయ్యేలా ఉంటుందని స్పష్టం చేస్తున్నాడు.

    పైసా వసూల్ మూవీ, రేటింగ్ 4/5

    ‘మహర్షి' చిత్రం పైసా వసూల్ ఎంటర్టెనర్ అని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుందని ఉమైర్ సంధు స్పష్టం చేశాడు. అంతే కాదు ఈ చిత్రానికి 4/5 రేటింగ్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రిలీజ్ ముందే పాజిటివ్ బజ్ ఉండటంపై అభిమానుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. మే 9న ఈ చిత్రం విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

    English summary
    "First Review #Maharshi from UAE Censor Board ! A Well Made Film in all aspects. #MaheshBabu Stole the Show all the way. Full on engaging Social Thriller. hegdepooja looking Stunning in the film. Paisa Vasool Family Entertainer." Umair Sandhu tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X