రెండు వారాలు బాక్సాఫీస్ కుమ్ముడే.. ‘మహర్షి’కి తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ పర్మిషన్!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మించిన 'మహర్షి' చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. రాష్ట్ర వాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లకు అదనంగా మరొక షో వేసుకోవడానికి అనుమతి మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

'మహర్షి' రిలీజ్ డే మే 9వ తేదీ నుంచి మే 22వ తేదీ వరకు... మొత్తం రెండు వారాల పాటు ఈ స్పెషల్ షోలకు పర్మిషన్ వచ్చింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్యలో మరొక అదనపు షో, ఓవరాల్‌గా 5 షోలు ప్రదర్శించనున్నారు.

రెండు వారాల పాటు బాక్సాఫీస్ కుమ్ముడే

రెండు వారాల పాటు బాక్సాఫీస్ కుమ్ముడే

మహేష్ బాబు సినిమా అంటేనే క్రేజ్ ఓ రేంజిలో ఉంటుంది. ఇది 25వ ల్యాండ్ మార్క్ మూవీ కావడం, ప్రత్యేకమైన కథతో ‘మహర్షి' చిత్రం తెరకెక్కుతుండటంతో సినిమాకు డిమాండ్ బాగా పెరిగింది. పైగా ఇపుడు వేసవి సెలవులు కావడంతో పిల్లలతో కలిసి సినిమా చూసేందుకు ఫ్యామిలీ ప్రేక్షకులు ఆసక్తి చూపుతుంటారు. స్పెషల్ షోలకు అనుమతి రావడంతో ‘మహర్షి' చిత్రం బాక్సాఫీసును కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఎన్నిరికార్డులు బద్దలవుతాయో?

ఎన్నిరికార్డులు బద్దలవుతాయో?

సాధారణంగానే సూపర్ స్టార్ సినిమా అంటే ఓపెనింగ్స్ బీభత్సంగా ఉంటాయి. ఇపుడు అదనపు షోలకు పర్మిషన్ ఇవ్వడంతో ఓపెనింగ్స్ భారీగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్లో ఉన్న ఓపెనింగ్ డే రికార్డులన్నీ బద్దలవ్వడం ఖాయంగా అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే బాహుబలి 2 రికార్డులను అధిగమిస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ‘మహర్షి’ గురించే...

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ‘మహర్షి’ గురించే...

‘మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సినిమాపై హైప్ మరింత పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ‘మహర్షి' సినిమా గురించి చర్చే సాగుతోంది. తొలి రెండు వారాలు ఏపీ, తెలంగాణలో ఉన్న మెజారిటీ థియేటటర్లు ‘మహర్షి' సినిమా ప్రదర్శనతో కళకళలాడబోతున్నాయి.

భారీగా అడ్వాన్స్ బుకింగ్

భారీగా అడ్వాన్స్ బుకింగ్

మరో వైపు ‘మహర్షి' చిత్రానికి ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఆన్‌లైన్లో టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇపుడు అదనపు షోలకు పర్మిషన్ ఇవ్వడంతో ఆ టికెట్స్ సైతం అందుబాటులో ఉంచారు. టికెట్స్ అమ్ముడుతున్న వైనం చేస్తుంటే... బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

మహర్షి

మహర్షి

మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి' తెరకెక్కుతోంది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటిస్తుండగా... అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X