‘మహర్షి’ గ్రాండ్ సక్సెస్ మీట్ జరిగే ప్లేస్ ఫిక్స్ అయింది
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' బ్లాక్ బస్టర్ విజయం అందుకుని భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. బుధవారంతో ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 75 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 59 కోట్లకు పైగా షేర్ రాబట్టి నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలు కొట్టింది.
ఈ నేపథ్యంలో 'మహర్షి' గ్రాండ్ సక్సెస్ మీట్ విజయవాడలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడి సిద్ధార్థ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ దీనికి వేదిక కాబోతోంది. మే 18వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్‌కు 'మహర్షి' టీమ్ మొత్తం హాజరు కాబోతున్నారు. మహేష్ బాబుతో పాటు పూజా హెగ్డే, అల్లరి నరేష్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాతలు దిల్ రాజు, పివిపి, అశ్వినీదత్ ఈ వేడుకలో సందడి చేయబోతున్నారు. మహేష్ బాబు అభిమానులు భారీ సంఖ్యలో తరలి రాబోతున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

మహేష్ బాబు కెరీర్లో 25వ సినిమా కావడంతో 'మహర్షి' మరింత ప్రత్యేకంగా మారింది. రిలీజ్ రోజు నుంచే మంచి టాక్ రావడంతో పాటు సమ్మర్ హాలిడేస్ కావడం ఈ చిత్రానికి వసూళ్ల పరంగా కలిసి వచ్చింది. రైతుల గురించి, వ్యసాయం ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఒక మంచి సందేశాత్మక చిత్రంగా తెరకెక్కించడంతో చాలా మందికి కనెక్ట్ అవుతోంది.
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెడ్గే హీరోయిన్‌గా నటించగా... అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.


Click it and Unblock the Notifications











