‘మహర్షి’కి నో కట్స్... ఫ్యామిలీ ప్రేక్షకులే టార్గెట్, రంగంలోకి దిగిన మహేష్ బాబు!

Recommended Video

Maharshi Movie Censor Report || Filmibeat Telugu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'మహర్షి'. ఇండస్ట్రీలోని బడా నిర్మాతలైన దిల్ రాజు, అశ్వీదత్, పిపివి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యమాలను పూర్తి చేసుకుంది.

సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా 'U/A' సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా నిడివి దాదాపు 3 గంటల ఉందని సమాచారం. బోర్డ్ సభ్యులు సైతం ఈ సినిమా చూసి ఎమోషనల్ అయినట్లు, ఇది ఇండస్ట్రీలో ఒక గొప్ప చిత్రంగా నిలుస్తుందని ప్రశంసించినట్లు టాక్.

ఫ్యామిలీ ప్రేక్షకులే టార్గెట్

మహేష్ బాబుకు కుటుంబ ప్రేక్షకుల ఫాలోయింగ్ ఎక్కువ. అందుకే ‘మహర్షి' చిత్రాన్ని ఫ్యామిలీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే లక్ష్యంగా రూపొందించారు. కుటుంబ విలువలతో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీ, యూత్ మెచ్చే అంశాలన్నీ కలగలిపి ఒక అద్భుతమైన దృశ్య కావ్యంగా తీర్చిదిద్దారు.

సినిమాలో మూడు భిన్నమైన అధ్యాయాలు

సినిమాలో మూడు భిన్నమైన అధ్యాయాలు

‘మహర్షి' చిత్రంలో మూడు భిన్నమైన అధ్యాయాలు కనిపించబోతున్నాయి. అందులో ఒకటి రిషి పాత్రకు సంబంధించి కాలేజీ లైఫ్.. యువతను ఆకట్టుకునేలా ఈ పార్ట్ డిజైన్ చేశారు. తర్వాత ఫ్యామిలీ డ్రామాకు ప్రధాన్యం ఇస్తూ కొంత భాగం సాగుతుందని, చివరల్లో రైతుల గురించి అద్భుతమైన థీమ్‌తో ఎమోషనల్‌గా ఉంటుందట.

మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్

మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్

సూపర్ స్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా‘మహర్షి' చిత్రం ఉండబోతోంది. ముగ్గురు బడా నిర్మాతలు ఈ చిత్ర నిర్మాణంలో భాగం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నింటినీ తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇతర పెద్ద సినిమాలు కూడా ఏమీ లేక పోవడంతో మే 9న ఆంధ్రా, తెలంగాణలో 90 శాతం స్క్రీన్లలో ఈ చిత్రమే ఉంటుందని టాక్.

భారీ ఓపెనింగ్సే టార్గెట్

భారీ ఓపెనింగ్సే టార్గెట్

భారీ ఓపెనింగ్స్‌తో పాటు హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించేలా ఈ చిత్రాన్ని మార్కెటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‍‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. మహేష్ బాబు గత చిత్రం ‘భరత్ అనే నేను' ఫుల్ రన్‌లో రూ. 200 కోట్లకుపైగా వసూలు చేయడంతో అంతకు మించి ఈ చిత్రం వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

రంగంలోకి దిగిన మహేష్ బాబు

సినిమా ప్రమోషన్లో భాగంగా మహేష్ బాబు్ అండ్ టీమ్ రంగంలోకి దిగింది. టీవీ ఇంటర్వ్యూలతో ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి' తెరకెక్కుతోంది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటిస్తుండగా... అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X