మహేష్ బాబు స్టామినా అదీ: రూ. 141 కోట్లతో ‘మహర్షి’ సంచలనం!

Recommended Video

aharshi Has Closed Its Pre-Release Business At 141.50 Cr | Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'మహర్షి' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగిన విధంగానే ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదేస్థాయిలో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ రికార్డ్ స్థాయిలో అమ్ముడైనట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు నటించిన గత చిత్రం 'భరత్ అనే నేను' బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. ఈ మూవీ ఎంత షేర్ సాధించిందో దాదాపు అదే స్థాయిలో 'మహర్షి' థియేట్రికల్ రైట్స్ అమ్ముడు కావడం గమనార్మం.

మహర్షి థియేట్రికల్ రైట్స్

మహర్షి థియేట్రికల్ రైట్స్

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘మహర్షి' మూవీ థియేట్రికల్ రైట్స్ రూ. 94.50 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేనే' రూ. 94.80 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించిన నేపథ్యంలో అందుకు ఏ మాత్ర తగ్గకుండా బిజినెస్ జరిగింది.

నిర్మాతల ఓన్ రిలీజ్

నిర్మాతల ఓన్ రిలీజ్

చిత్రాన్ని నిర్మాతలే సొంతంగా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. నైజాం, ఉత్తరాంధ్రలో దిల్ రాజు ఓన్ రిలీజ్ చేస్తున్నారు. మరో నిర్మాత అశ్వినీదత్ కృష్ణ, గుంటూరులో సినిమాను విడుదల చేస్తున్నట్లు సమాచారం.

ఆ ఏరియాల్లో ఎన్ఆర్ఏ బేసిస్‌‌లో

ఆ ఏరియాల్లో ఎన్ఆర్ఏ బేసిస్‌‌లో

సీడెడ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెల్లూరు ఏరియాల్లో నాన్ రికవరబుల్ అడ్వాన్స్ బేసిస్‌లో రైట్స్ అమ్మినట్లు తెలుస్తోంది. సినిమాకు భారీ డిమాండ్ ఉండటం, సమ్మర్ కావడంతో రైట్స్ ఊహించని స్థాయిలో భారీ రేటుకు అమ్ముడయ్యాయి.

ఓవర్సీస్, ఇతర రాష్ట్రాలు

ఓవర్సీస్, ఇతర రాష్ట్రాలు

ఇక మహర్షి చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ రూ. 12.50 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో పాటు కర్నాటక, తమిళనాడు, నార్త్ ఇండియా కలిపి రూ. 10 కోట్లకు రైట్స్ అమ్ముడు పోయినట్లు సమాచారం.

మహేష్ బాబు కెరీర్లో థర్డ్ హయ్యెస్ట్

మహేష్ బాబు కెరీర్లో థర్డ్ హయ్యెస్ట్

అయితే రూ. 94.50 కోట్లకు రైట్స్ అమ్ముడు పోవడం మహేష్ బాబు కెరీర్లో హయ్యెస్ట్ ఫిగర్ అయితే కాదు. ఇంతకు ముందు భరత్ అనే నేను, స్పైడర్ చిత్రాలు అంతకంటే ఎక్కువ రేటుకు అమ్ముడు పోయాయి. అయితే రిస్క్ ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఇలా సెట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇతర రైట్స్ అన్నీ కలిపితే టోటల్ బిజినెస్ రూ. 141.50 కోట్లు

ఇతర రైట్స్ అన్నీ కలిపితే టోటల్ బిజినెస్ రూ. 141.50 కోట్లు

‘మహర్షి' శాటిలైట్ రైట్స్ తెలుగు, డబ్బింగ్... డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్ అన్ని కలిపి మరో రూ. 47 కోట్ల అదనపు ఆదాయం వచ్చినట్లు సమాచారం. అన్నీ కలుపుకుంటే ఈ చిత్రం రిలీజ్ ముందే టోటల్ రూ. 141 కోట్ల బిజినెస్ చేసింది.

మహర్షి

మహర్షి

మహేష్ బాబు సరనన పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X