మహేష్ బాబుకు ఎదురు దెబ్బ.. ఓవర్సీస్ మార్కెట్‌లో భారీగా పడిపోయిన మహర్షి కలెక్షన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా మహర్షి‌కి ఓవర్సీస్ మార్కెట్‌ బాగా దెబ్బేసింది. మొదటి నుంచే ఓవర్సీస్ మార్కెట్‌లో డల్‌గా ఉన్న మహర్షి సినిమా సెకండ్ వీకెండ్ వచ్చేసరికి మరింత డీలా పడింది. తాజాగా మహర్షి ఓవర్సీస్ కలెక్షన్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం..

గతంలో మహేష్ బాబు హీరోగా భారీ అంచనాల మధ్య విడుదలైన బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలు ఓవర్సీస్ మార్కెట్‌లో ఆశించిన ఫలితాలు రాబట్టలేక పోయాయి. తాజాగా మహర్షి కూడా అదే బాటపట్టి కలెక్షన్స్ రాబట్టడంలో వెనకడుగేసింది. ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం 1. 74 మిలియన్ డాలర్ల గ్రాస్ మాత్రమే మహేష్ మహర్షి రాబట్టగలిగింది. సెకండ్ వీకెండ్ వసూళ్లు పరిశీలిస్తే.. శుక్రవారం 48 వేల డాలర్లు, శనివారం 78 వేల డాలర్లు అలాగే ఆదివారం 37 వేల డాలర్లు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే మహేష్ కెరీర్‌లో వచ్చిన సినిమాల్లో ఓవర్సీస్ మార్కెట్‌ పరంగా మహర్షి మూవీ అట్టర్ ప్లాప్ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

Maharshi movie success celebrations held at vijayawada. The latest reports came from overseas. It shows Maharshi is big flop in Mahesh carear.

మరోవైపు దేశంలో మహర్షి హంగామా బాగా కొనసాగుతోంది. రైతు నేపథ్యంలో చూపిన సన్నివేశాలు, పలు సామాజిక అంశాలు చిత్రంలో హైలైట్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ దాటేసిన ఈ సినిమా 200 కోట్ల మార్క్‌కి చేరువైంది. ఈ నేపథ్యంలో ఇటీవలే విజయవాడలో గ్రాండ్ సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు మేకర్స్. వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ సినిమాగా మహర్షి ప్రేక్షకుల ముందుకొచ్చింది. దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వీ పొట్లూరి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా.. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X