మహర్షి హిందీ రీమేక్‌కి రంగం సిద్ధం... హీరో ఎవరో తెలుసా

Recommended Video

Maharshi Movie To Remake In Kollywood & Bollywood || Filmibeat Telugu

ఇటీవలే విడుదలైన మహేష్ బాబు 25వ చిత్రం మహర్షి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. భారీ కలెక్షన్స్ రాబడుతూ గత రికార్డులను తిరగరాస్తోంది. మహేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ సినిమాగా టర్న్ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి టాలీవుడ్‌లో ఎపిక్ బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది. దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లోనూ రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ విశేషాలేంటో చూద్దాం..

మహర్షి డిమాండ్..

మహర్షి డిమాండ్..

విడుదలైన మొదటి రోజే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమాపై రోజు రోజుకు క్రేజ్ పెరుగుతూ వస్తోంది. చిత్రంలో మహేష్ నటన, చూపిన సామాజిక అంశాల పట్ల పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారంతా. దీంతో మహర్షి చిత్రానికి భారీ డిమాండ్ చేకూరింది. ఇతర భాషా చిత్రాల దర్శక నిర్మాతలు ఈ సినిమాను రీమేక్ చేసే సన్నాహాలు చేస్తున్నారు.

తమిళంలో విజయ్ హీరోగా

తమిళంలో విజయ్ హీరోగా

మహర్షి చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు ఆసక్తిగా ఉన్న మేకర్స్.. అందుకు సంబంధించి ఇప్పటికే అన్నిపనులు పూర్తిచేశారని తెలుస్తోంది. ఈ రీమేక్‌లో మహేష్ ప్లేస్‌లో తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించనున్నాడట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.

హిందీ రీమేక్‌లో హీరోగా

హిందీ రీమేక్‌లో హీరోగా

తెలుగులో భారీ విజయం సాధించిన మహర్షి చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేయనున్నారనేది తాజా సమాచారం. అయితే ఈ సినిమాలో మహేష్ రోల్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పోషించనున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు సల్మాన్ కోసం మహర్షి ప్రత్యేక షో ఏర్పాటు చేయబోతున్నారట. ఈ షోని ప్రభుదేవాతో కలిసి సల్మాన్ ఇప్పటికే చూసేశారని, అంతా ఓకే అయితే త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నారని అంటున్నాయి సినీ వర్గాలు.

గతంలో కూడా మహేష్ రీమేక్‌లో..

గతంలో కూడా మహేష్ రీమేక్‌లో..

గతంలో మహేష్ హీరోగా వచ్చిన పోకిరి రీమేక్ లో కూడా సల్మాన్ ఖానే హీరోగా నటించారు. వాంటెడ్ పేరుతో 2009 లో విడుదలైన ఈ సినిమా సల్మాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో మహర్షి రీమేక్ సల్మాన్ హీరోగా తెరకెక్కడం కన్ఫర్మ్ అని తెలుస్తోంది.

మహేష్ కెరీర్‌లో ప్రత్యేకం

మహేష్ కెరీర్‌లో ప్రత్యేకం


వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో హై టెక్నీకల్ వాల్యూస్‌తో మహర్షి సినిమా రూపొందింది. చిత్రానికి దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వీ పొట్లూరి నిర్మాతలుగా వ్యవహరించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా అల్లరినరేష్ కీలక పాత్ర పోషించారు. రైతు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా పేరుతెచ్చుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X