మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్: వేదిక వద్ద వెంకటేష్, విజయదేవరకొండ హంగామా! ఏం జరిగిందంటే
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా బ్యానర్లపై అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'మహర్షి'. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. కమెడియన్ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఆటపాటలతో వేదిక హోరెత్తింది. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడంతో పలువురు సినీ ప్రముఖులు మహేష్ గురించి ప్రత్యేకంగా తన అభిప్రాయాలను వెల్లడించారు. వారేమన్నారంటే..

క్లైమాక్స్ చూసిన తర్వాత కళ్లు తడవకుండా బయటకురారు: దేవిశ్రీ ప్రసాద్
ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ... ‘‘మహేష్ బాబు సినిమా అంటే చాలా ఎగ్జైటెడ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఆయన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న చిత్రాలు సెలక్ట్ చేసుకుంటారు. వర్క్ చేసే ప్రతి టెక్నీషియన్‌కు అది మూవీ అని మాత్రమే కాకుండా ఒక బాధ్యతగా అనిపిస్తుంది. ‘మహర్షి' గ్రేట్ జర్నీ. ఈ సినిమాకు మొదట థాంక్స్ చెప్పాల్సింది వంశీ పైడిపల్లిగారికి. కథ చెప్పినపుడు డిఫరెంట్ ఎమోషన్స్‌కు లోనయ్యాను. కొన్ని సందర్భాల్లో ఏడ్చేశాను. అంత టచింగ్‌గా ఉంటుంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్‌గా కాకుండా ఈ సినిమాను మీ అందరి కంటే ముందు సినిమా చూసిన ఒక ఆడియన్‌గా చెబుతున్నాను. ఈ సినిమా మొత్తం ఒక ఎత్తయితే.. క్లైమాక్స్ ఒక ఎత్తు. క్లైమాక్స్ చూసిన తర్వాత కళ్లు తడవకుండా బయటకురారు.'' అన్నారు.

టికెట్ల కోసం కష్టపడ్డా.. విరక్తితో చెత్త అనుభవం.. విజయ్ దేవరకొండ
మహేష్ బాబు మాదిరిగానే యంగ్‌గా, హ్యాండ్సమ్‌గా ఉండాలని కోరుకొంటున్నాను. టికెట్ల కోసం కష్టపడిన వరస్ట్ మూమెంట్లు ఉన్నాయి. విరక్తి వచ్చే వరకు చెత్త అనుభవాలు ఉన్నాయి. బెస్ట్ మూమెంట్ మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే. సెక్యూరిటీ తీసుకొచ్చి కంఫర్ట్‌గా కూర్చొపెట్టారు. మహేష్ చెప్పిన డైలాగ్స్‌లో నాకు చాలా ఇష్టమైనవి ఉన్నాయి. వాటిని స్టేజ్ మీద నుంచి అందరితో చెప్పిస్తాను.

గొప్ప సినిమా రూపొందించడం పెద్ద బాధ్యత
సూపర్‌స్టార్ మహేష్ ఫ్యాన్స్‌కు అభినందనలు. 25వ సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు, పీవీపీకి మెమోరబుల్‌గా మారాలని కోరుకొంటున్నాను. మహేష్ జీవితంలో గొప్ప సినిమాగా రూపొందించడం గొప్ప బాధ్యత. ట్రైలర్‌లో ఎమోషన్స్ ఉండటం చాలా కష్టం. మహేష్ కెరీర్‌లో బెస్ట్ సినిమాగా మారాలని కోరుకొంటున్నాను. పూజా, అల్లరి నరేష్, పోసానికి గొప్ప చిత్రంగా మారాలి. దేవీ శ్రీ ప్రసాద్ గురించి నేను ఎక్కువగా చెప్పలేను. చిత్ర యూనిట్‌కు బెస్ట్ ఆఫ్ లక్ అని కొరటాల శివ అన్నారు.

మహర్షి బ్లాక్‌బస్టర్.. అప్పుడే మాట్లాడుతాను
మహర్షి లాంటి పెద్ద సినిమా వేడుకలో పాల్గొనడం హ్యాపీగా ఉంది. మహేష్ బాబు లాంటి హీరోతో నటించడం చాలా సంతోషంగా ఉంది. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ నాకు బాగా తెలుసు. ఈ సినిమా గురించి చాలా మాట్లాడాలని ఉంది. కానీ సక్సెస్ మీట్‌లో మాట్లాడుతాను. ఎందుకంటే మహర్షి అతిపెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. కామెడీ యాంగిల్‌ను చూడకుండా.. సీరియస్ పాత్రను నాకు ఇచ్చిన వంశీ పైడిపల్లి, మహేష్ బాబుకు నా థ్యాంక్స్ అని అల్లరి నరేష్ అన్నారు.

దర్శకుడు వంశీ నా చెడ్డీ బడ్డీ: సుధీర్ బాబు
ఈ ఫంక్షన్‌కు రావడం ఏదో ఫ్యామిలీ పంక్షన్ వచ్చినట్లు ఉంది. దిల్ రాజుగారు, అశ్వినీదత్ గారు, పివిపిగారు నాకు చాలా సన్నిహితులు. దర్శకుడు వంశీ నా చెడ్డీ బడ్డీ అని చెప్పొచ్చు. ఇద్దరం ఒకే రూములో ఉండేవారం. టీజర్లో డైలాగ్ ఉంది.. సక్సెస్ అనేది డెస్టినేషన్ కాదు, జర్నీ అని. రియల్ లైఫ్‌లో మహేష్ ప్రయాణం అలాగే ఉంటుంది. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో కొన్ని బాక్సాఫీసు వద్ద ఆడక పోయినా ఆయన కథలు ఎంపిక బావుంటుంది. ఎంటైర్ టీమ్‌కు గుడ్ లక్. ఒక పండుగాడు, ఒక మురారి మాదిరిగానే రిషి అనే పాత్ర కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలిచిపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

వేదిక వద్దకు వచ్చిన వెంకటేష్, విజయ్ దేవరకొండ
ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో పాల్గొనడానికి ముఖ్య అతిథులుగా విక్టరీ వెంకటేష్, విజయ్ దేవరకొండ వేదిక వద్దకు వచ్చారు. ఇంకా సుధీర్ బాబు, అనిల్ సుంకర, మీనాక్షి దీక్షిత్, అనిల్ రావిపూడి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదిక వద్దకు వెంకటేష్, విజయ్ దేవర కొండ రాగానే పెద్ద ఎత్తున ప్రేక్షకుల్లో హడావిడి సృష్టించారు. మహేష్ బాబు వారిని సాదరంగా ఆహ్వానించారు.

దిల్ రాజు, వాళ్ల బ్రదర్ సిరీస్ గురించి పోసాని కామెంట్
పోసాని మాట్లాడుతూ.... ‘‘నేను కృష్ణగారి అభిమానిని. ఆయన్ను ఎంత ప్రేమిస్తానో మహేష్ బాబును అంతే ప్రేమిస్తాను. మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను' సినిమా చేశాను, ఇపుడు ‘మహర్షి'లో చేస్తున్నాను. దీని తర్వాత మహేష్ బాబు మూవీలో కూడా నాకు మంచి వేషం అనిల్ రావిపూడి ఇచ్చారు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి నిర్మాతలుండేవారు. రామానాయుడుగారు ఉన్నంతకాలం వాళ్ల బేనర్లో ఎంతో మంది డైరెక్టర్లను, ఆర్టిస్టులను, టెక్నీషియన్లను పరిచయం చేసి పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. ఆ తర్వాత త్రివిక్రమరావుగారు, అశ్వినీదత్ ఇలా పెద్ద నిర్మాతలు సేవ చేశారు. ఇపుడు దిల్ రాజు, వాళ్ల బ్రదర్ సిరీస్ గురించి చెప్పాలి. డైరెక్టర్ హిట్ సినిమా తీశాడా? ప్లాప్ సినిమా తీశాడా? అనే సంబంధం లేకుండా మంచి కథ తెస్తే అవకాశం ఇచ్చి ఎంతో మంది దర్శకులను, ఆర్టిస్టులను వెలుగులోకి తెచ్చిన బేనర్ వారిది. వారి సేవలు తెలుగు సినిమా పరిశ్రమలో కొనసాగాలని కోరుకుంటున్నాను.'' అన్నారు.

దిల్ రాజు, పివిపిలతో కలిసి పని చేయడం గర్వంగా ఉంది: అశ్వినీదత్
ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన అశ్వినీదత్ మాట్లాడుతూ... ‘‘అలనాటి ‘అగ్ని పర్వతం' నుంచి ఘట్టమనేని కుటుంబంతో ఎన్నో హిట్ సినిమాలు తీశాను. మహేష్ బాబును ‘రాజకుమారుడు' సినిమా ద్వారా పరచయం చేసి ఇపుడు ఈ 25వ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది. మే 1న ప్రీ రిలీజ్ ఈవెంట్, మే 9న సినిమా రిలీజ్ కావడం..... గతంలో నా సినిమాలు ‘జగదేక వీరుడు అతిలోక సుందరి', ‘మహానటి'కి ఇలానే జరిగింది. గతంలో అల్లు అరవింద్, రాఘవేంద్రరావుతో కలిసి సినిమాలు నిక్మించాను. ఈ రోజు యంగ్ అండ్ డైనమిక్ నిర్మాతలు దిల్ రాజు, పివిపిలతో కలిసి పని చేయడం గర్వంగా ఉంది. ఒకటి మాత్రం తప్పకుండా చెప్పగలను ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది.'' అన్నారు.

అప్పుడే చెప్పా.. పెద్ద హీరో అవుతావని.. రాఘవేంద్ర రావు
మహేష్ బాబు 25 సినిమాలు పూర్తి చేసినందుకు ముందుగా థ్యాంక్స్. ఈ సందర్బంగా సూపర్ స్టార్ కృష్ణ అంటే మీ నాన్న ఎంత ఆనంద పడుతున్నారో అంతే సంతోషం నాకు కలుగుతున్నది. నాతో తొలి సినిమా చేసిన సమయంలో నీవు గొప్పస్టార్ అవుతావని నేను నీతో ఓ మాట చెప్పాను. నన్ను మామయ్య అంటూ పిలిచే వాడివి. అది నాకు ఎంతో ఇష్టం. నీవు మరింత ఎత్తుకు ఎదుగాలని కోరుకుంటూ నీకు ఆల్ ది బెస్ట్ అని దర్శకుడు రాఘవేంద్ర రావు అన్నారు.

గొప్ప అదృష్టంగా భావిస్తాను.. కియారా అద్వానీ
మహేష్ సార్ నీకు బెస్ట్ విషెస్. మీ 25వ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకొంటున్నాను. పూజా హెగ్డేతోపాటు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు. మీతో భరత్ అనే నేను చిత్రంలో నటించే అవకాశం రావడం నాకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. మీ సినిమాను చూడటానికి చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను అని కియారా అద్వానీ అన్నారు.

నా కల సాకారమైంది.. కొరటాల శివ
నా కెరీర్ ఆరంభంలో మహేష్ బాబు లాంటి సూపర్‌స్టార్‌తో సినిమాలు చేయడం నా కల సాకారమైందని భావిస్తాను. ఓ డైరెక్టర్‌కు పూర్తిగా లొంగిపోయి యాక్టర్ దొరకడం చాలా కష్టం. హిట్టు, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా.. హిట్టయితే ఓ వారం.. ఫ్లాప్ అయితే మరో వారం బాధపడుతాం. కానీ హీరో, సినిమాతో జర్నీ చాలా ఇంపార్టెంట్. మహేష్‌తో జర్నీ ఎవరైనా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆయన కెరీర్‌లో 25వ సినిమా గొప్ప సినిమా అవుతుంది. ఆయన నుంచి 50వ సినిమా కూడా రావాలి. ఈ సినిమా ఆయన కెరీర్‌లో గొప్ప సినిమా అవుతుందని ఆశిస్తున్నాను అని కొరటాల శివ అన్నారు.

మీతో నటించడం గొప్ప అనుభూతి అని శృతిహాసన్
మహేష్ బాబు 25వ సినిమా రిలీజ్ అవుతున్నందుకు హ్యాపీగా ఉంది. 35, 45, 55 సినిమాలే కాకుండా మరిన్నీ రావాలని కోరుకొంటున్నాను. మీతో కలిసి శ్రీమంతుడు చిత్రంలో నటించే అవకాశం రావడం గొప్పగా ఫీలవుతాను. మీతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి అని శృతిహాసన్ అన్నారు.

పర్మిషన్ అడిగే వారు.. సుకుమార్
1 నేనొక్కడినే సినిమా చేయడానికి ముందు మహేష్ సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు మూవీలో నటించాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో నాకు శ్రీకాంత్ అడ్డాల చాలా విషయాలు చెప్పేవారు. మహేష్ చిన్నపిల్లాడి మనస్తత్వం అని చెప్పడంతో నాకు ఆశ్చర్యం కలిగింది. నేను ఆయనతో పనిచేసేటప్పుడు చిన్న లోపం అనిపించినా మరోసారి చేద్దాం సార్ అని పర్మిషన్ అడిగినట్టు రిక్వెస్ చేసే వాడు. మహర్షి చాలా పెద్ద హిట్ కావాలని కోరుకొంటున్నాను. ఆల్ ది బెస్ట్ మహేష్ అని దర్శకుడు సుకుమార్ అన్నారు.

ఇగో లేని గొప్ప మానవతావాది.. కృతి సనన్
నా తొలి సినిమా మహేష్ బాబుతో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టం. ఆ సమయంలో చాలా ఒద్దికగా ఉండి... నాకు మొదటి సినిమా చేస్తున్నాననే ఫీలింగ్ కలిగించలేదు. చాలా సినిమాలు చేసిన హీరోలకు కొంత ఇగో ఉంటుంది. కానీ మహేష్‌లో అలాంటి ఫీలింగ్ ఎక్కడా కనిపించదు. ముఖ్యంగా గొప్ప మానవత్వం ఉన్న మనిషి అని కృతి సనన్ అన్నారు.


Click it and Unblock the Notifications











