For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘మహర్షి’ వివాదం: అబ్బే అదేం లేదంటున్న తెలంగాణ మంత్రి.. ఇక్కడేమో ప్రేక్షకుల జేబుకు చిల్లు!

|
#Maharshi Ticket Rates Hiked With Permission || Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన 'మహర్షి' చిత్రం మే9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వేసవి సెలవుల సీజన్ కావడంతో రెగ్యులర్ ఆడియన్స్, అభిమానులతో పాటు... ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా భారీ సంఖ్యలో తరలి వస్తారనే అంచనా ఉన్నాయి. అందుకు తగిన విధంగానే గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేశారు.

సినిమాకు భారీగా డిమాండ్ ఉండటంతో... ఇదే అదునుగా టికెట్ల రేట్లు పెంచినట్లు, తద్వారా అదనపు ఆదాయం తమ జేబులో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు రెండు రోజులుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో ఇటు ప్రభుత్వం చెబుతున్న దానికి, వాస్తవానికి పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉండటం గమనార్హం.

టిక్కెట్ల ధరలు పెరిగాయా?

టిక్కెట్ల ధరలు పెరిగాయా?

ప్రభుత్వ అనుమతులతో సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో రూ. 80 నుంచి రూ. 110, మల్టిఫ్లెక్స్ థియేటర్లలో రూ.138 నుండి రూ. 200కు ధరలు పెంచినట్లు రెండు రోజులుగా కొన్ని వెబ్ సైట్స్, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. టికెట్ రేట్లు పెంచడం ద్వారా భారీగా కలెక్షన్స్, లాభాలు రాబట్టడమే వారి లక్ష్యంగా థియేటర్ల యజమానులు చక్రం తిప్పినట్లు వార్తలు వెలువడ్డాయి.

బెంబేలెత్తిపోయిన సగటు సినీ అభిమాని

బెంబేలెత్తిపోయిన సగటు సినీ అభిమాని

ఇప్పటికే థియేటర్లలో టిక్కెట్ల రేట్లు మండి పోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లి సినిమా చూడాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని మధ్యతరగతి సినీ అభిమాని అసంతృప్తితో ఉన్నాడు. ‘మహర్షి' సినిమాతో రేట్లు మరింత పెరిగాయనే ప్రచారంతో మరింత బెంబేలెత్తిపోయారు.

రంగంలోకి తెలంగాణ మంత్రి తలసాని, అబ్బే అదంటూ లేదంటూ ప్రకటన

రంగంలోకి తెలంగాణ మంత్రి తలసాని, అబ్బే అదంటూ లేదంటూ ప్రకటన

సినిమా టికెట్ల ధరలను పెంచినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, రేట్లు పెంచుతూ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సినిమా టికెట్ల ధరలను పెంచిన దాఖలాలు లేవన్నారు.

వాస్తవం ఇదీ.. ప్రేక్షకుల జేబుకు చిల్లు!

వాస్తవం ఇదీ.. ప్రేక్షకుల జేబుకు చిల్లు!

మంత్రి వాదన ఇలా ఉంటే.... వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పెరిగిన ధరలకే టికెట్లు విక్రయిస్తున్నారు. థియేటర్ల ఓనర్లు ధరల పెంపు విషయంలో కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది.

 ‘మహర్షి'

‘మహర్షి'

మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి' తెరకెక్కుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెడ్గే హీరోయిన్‌గా నటిస్తుండగా... అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు..

English summary
heatre owners Hike Maharsh ticket Prices. Telangana theatre owners approached the High Court about increase the prices of tickets during this summer season. The Court agreed and issued a notice.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more