తాప్సీతో రెండేళ్లు డేటింగ్ చేసా, ఇద్దరితో ముద్దుల్లో మునిగా!
తాప్సీతో రెండేళ్లు డేటింగ్ చేసాను, ఈ విషయం లోకమంతటికీ తెలుసు. పర్సనల్ విషయాలను పర్సనల్ గానే ఉంచడం నాకిష్టం అంతకు మించి మాట్లాడటం ఇష్టం లేదన్నారు. మంచు మనోజ్‌తో జరిగిన గొడవ గురించి మాట్లాడుతూ... గొడవ జరిగిన మాట వాస్తవమే. కానీ మేము ఎప్పటి నుంచో మంచి స్నేహితులం. మనోజ్ చాలా మంచి వాడు. కొందరు ఆయన్ను రెచ్చగొట్టడం వల్లనే ఆ రోజు గొడవ జరిగింది అని మహత్ రాఘవేంద్ర చెప్పుకొచ్చారు.
తన కుటుంబ నేపథ్యం గురించి చెబుతూ... 'అమ్మ నాసాలో సైంటిస్టుగా పని చేసారు. నాన్న కెమికల్ ఇంజనీర్. దుబాయ్‌లో పని చేస్తున్నారు. నేను చెన్నైలోని హిందుస్థాన్ కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్స్ లో గ్రాజ్యుయేషన్ చేస్తూ డిస్‌కంటిన్యూ చేసాను. హీరో శింబు నా చిన్ననాటి స్నేహితుడు. దాంతో నాకు సినిమాలపై ఆసక్తి పెరిగింది. నేను పుట్టి పెరిగింది చెన్నైలోనే అయినప్పటికీ నా మాతృభాష తెలుగే. అందుకే నేను తెలుగు, తమిళం రెండు రాష్ట్రాలకు చెందిన వాడిని' అని చెప్పుకొచ్చారు మహత్.
'బ్యాక్ బెంచ్ స్టూడెంట్' చిత్ర హీరోయిన్లలో ఒకరైన పియా బాజ్ పాయ్‌తో తనకు ఎఫైర్ ఉన్నట్లు వస్తున్న వార్తలపై మహత్ స్పందిస్తూ.... నేను ఈచిత్రంలో పియాతో పాటు అర్చన కవితో కూడా ముద్దు సీన్లు చేసాను. కానీ పియాతో మాత్రమే ఎపైర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది అర్చనతో ఉన్నట్లు మాత్రం జరుగడం లేదు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు మహత్.
బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఈచిత్రం ఈ నెల 15న విడుదల కాబోతోంది. సోలో హీరోగా మహత్‌కు ఇదే తొలిచిత్రం. ఈ చిత్రంలో పియా బాజ్ పాయ్, అర్చన కవి హీరోయిన్లు. మల్టీ డైమన్షన్ ప్రై.లి సమర్పిస్తోంది. మధుర శ్రీధర్ దర్శకత్వంలో షిరిడీ సాయి కంబైన్స్ పతాకంపై ఎం.వి.కె.రెడ్డి నిర్మించారు.


Click it and Unblock the Notifications












