మహాత్మ ట్రైలర్ రద్దు
శ్రీకాంత్ కథాయకుడుగా డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'మహాత్మ' చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం రద్దయింది. ఈ చిత్రం లోగోను ఈనెల 2న హైద్రాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు కృష్ణవంశీ ప్లాన్ చేసినప్పటికీ చివరి నిమిషంలో వాయిదా వేశారు. ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కుకున్న విషయం బుధవారంనాడు తెలియడంతో తమ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు దర్శకనిర్మాతలు తెలిపారు.
హీరో శ్రీకాంత్ 100వ చిత్రంగా 'మహాత్మ' తెరకెక్కుతోంది. 12 కోట్ల భారీ బడ్జెట్ తో సి.ఆర్.మనోజర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ కు జోడిగా భావన నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్రం ఆడియోను ఇదే నెలలో విడుదల చేసి మహాత్మాగాంధీ జన్మదినోత్సవమైన అక్టోబర్ 2న సినిమా విడుదల చేయాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. దేశానికి ఎందరో భారతరత్నలు ఉన్నా జాతిపిత ఒకరేననీ, మహాత్మా గాంధీ సిద్ధాంతాలు నేటికీ ఆచరణయోగ్యమనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నదని అంటున్నారు.


Click it and Unblock the Notifications











