మహాత్మ బడ్జెట్ అంతా!?
ముందు మహాత్మా చిత్రానికి ఎనిమిది కోట్లు బడ్జెట్ అనుకున్నాం. అయితే కొన్ని కారణాల వల్ల ఈ బడ్జెట్ పదమూడు కోట్లకు పెరిగింది అంటున్నారు మహాత్మ నిర్మాత సి.ఆర్.మనోహర్. మహాత్మ చిత్రం సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పుకొచ్చారు.అలాగే వీలైతే శ్రీకాంత్ 101 చిత్రం కూడా నేనే చేయాలని అనుకుంటున్నాను అన్నారు. ఇక ఈ చిత్రం చేయటానికి కారణం చెబుతూ "శ్రీకాంత్-కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన 'ఖడ్గం' చిత్రం చూసి నేను ఎంతో ఇన్‌స్పైర్ అయ్యాను. తప్పనిసరిగా వారిద్దరి కలయికలో ఓ మంచి చిత్రం చేయాలనే తపనతోనే 'మహాత్మ' నిర్మించాను. ఇప్పుడు ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఎంతో ఆనందంగా వుంది' అంటున్నారు ఆయన.
ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా అత్యాధునిక సాంకేతికతో ఎంతో రిచ్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. పరుచూరి బ్రదర్స్ కలం పదునుకు కృష్ణవంశీ దర్శకత్వ ప్రతిభ తోడై చిత్రం అద్భుతంగా వచ్చింది. నేడు సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు' అని తెలిపారు.
సినిమా అనేది వ్యాపారమే కాదనలేం. కానీ సినిమాలో సమాజాన్ని చైతన్యపరిచే సందేశం కూడా ఎంతో అవసరం అనేది నా అభిప్రాయం. డబ్బులు సంపాదించాలంటే నాకు చాలా వ్యాపారాలున్నాయి. సినిమాని కేవలం కమర్షియల్ యాంగిల్‌లో నేను ఆలోచించను. భవిష్యత్‌లో కూడా రెగ్యులర్ ఫార్ములా చిత్రాలు కాకుండా వైవిధ్యభరితమైన చిత్రాలే నిర్మిస్తాను' అన్నారు. శ్రీకాంత్ కెరీర్‌లోనే ఈ చిత్రానికి భారీ వసూళ్లు వచ్చాయని, ఈ కలెక్షన్స్ ఇలాగే కొనసాగుతాయనే ఆశాభావాన్ని మనోహర్ వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











