మహాత్మ కై కోర్టులో డబ్బు జమ
రచయిత అనుమతి లేకుండా పాటను వాడుకున్నారన్న వివాదం నేపధ్యంలో మహాత్మ నిర్మాత సీఆర్ మనోహర్ సిటీ సివిల్ కోర్టులో యాభై వేలు డిపాజిట్ చేసారు. తాను రచించిన నేలపురి గాజులు పాటను అనుమతి లేకుండా మహాత్మ చిత్రంలో వాడుకున్నారని ఆరోపిస్తూ సిద్దిపేటకు చెందిన ఆవుదుర్తి లక్ష్మణ్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పాట రచయిత సిరివెన్నెలకు లక్ష రూపాయలు రెమ్యునేషన్ చెల్లించామని నిర్మాత తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టు తీర్పు మేరకు ఎంత పరిహారమైనా చెల్లిస్తామని, మొదటి విడతగా యాభై వేలు చెల్లిస్తున్నామని రెండో విడతగా మరికొంత మొత్తాన్ని జమ చేస్తామన్నారు. కోర్టు తదుపరి విచారణను ఈ నెల 21 కు వాయిదా వేసింది.
మహాత్మా శ్రీకాంత్ కృష్ణవంశి ఆవుదుర్తి లక్ష్మణ్ సిరివెన్నెల యాబైవేలు సివిల్ కోర్టు నేలపురి గాజులు mahatma srikanth krishna vamsi manohar civil court sirivennala


Click it and Unblock the Notifications