LGM Twitter Review: ధోని నిర్మించిన సినిమాకు ఊహించని రెస్పాన్స్.. ఎందుకు తీశారంటూ?

ఇండియన్ క్రికెట్ ప్రపంచంలో తనకంటూ సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni). క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు బద్దలు గొట్టిన ధోని పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా పని చేశాడు. అంతేకాకుండా ఆయన బయోపిక్ మీద ఏకంగా సినిమానే వచ్చింది. అలాంటి ధోని సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. ధోని ఎంటర్టైన్ మెంట్ అని సంస్థను ప్రారంభించిన ఈ మిస్టర్ కూల్ తాజాగా ప్రొడ్యూస్ చేసిన సినిమా ఎల్‌జీఎమ్ (LGM Movie) (Lets Get Married Movie). మరి ఈ సినిమాపై నెటిజన్ల టాక్ ఎలా ఉందో ట్విటర్ రివ్యూలో చూసేద్దాం.

నటీనటులు:ఇండియన్ ఎక్స్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన తొలి సినిమా 'ఎల్‌జీఎం' (LGM Movie). 'లెట్స్ గెట్ మ్యారీడ్' అనేది క్యాప్షన్. లవ్ టుడే ముద్దుగుమ్మ ఇవానా (Ivana), కోలీవుడ్ హీరో హరీష్ కల్యాణ్ (Harish Kalyan) జోడీగా నటించిన ఈ సినిమాలో నదియా, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. రమేష్ తమిళమణి తెరకెక్కించిన ఈ సినిమాను సాక్షి ధోని, వికాస్ హస్జా నిర్మించారు.

Mahendra Singh Dhoni Sakshi Produced Film LGM Twitter Review

పలు విధాలుగా:లెట్స్ గెట్ మ్యారీడ్ సినిమా ఇప్పటికే తమిళంలో జూలై 28న విడదలైంది. అయితే ఈ సినిమాను ఒకేసారి రెండు భాషల్లో కాకుండా కాస్తా ఆలస్యంగా తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగులో అదే టైటిల్ తో డబ్ చేసి ఆగస్టు 4న అంటే ఇవాళ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లెట్స్ గెట్ మ్యారీడ్ మూవీపై నెటిజన్లు పలు విధాలుగా రియాక్ట్ అయ్యారు.

అవసరం ఏముంది:తనకు కాబోయే అత్తగారు ఎలాంటిదో, తనతో ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకునే ఓ యువతి వారం రోజుల ట్రిప్ వేస్తుంది. ఈ ట్రిప్ లో ప్రేమించిన అమ్మాయి, తల్లి మధ్య ఓ యువకుడు ఎలా నలిగాడన్న కథాంశాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. లెట్స్ గెట్ మ్యారీడ్ సినిమా చూసిన ప్రజలు ఇలాంటి మూవీ తీయాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నిస్తున్నారు.

ఆ సినిమా బెటర్:ధోని భార్య సాక్షి నిర్మించిన లెట్స్ గెట్ మ్యారీడ్ సినిమాలో మంచి కథాంశం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. "హరీష్ కల్యాణ్ లెట్స్ గెట్ మ్యారీడ్ సినిమాకు నెగెటివ్ రెస్పాన్స్, రివ్యూస్ వస్తున్నాయి. ఈ సినిమా చూసి టైమ్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనికన్నా మలయాళం సినిమా లవ్ చూడటం బెటర్" అని ఓ నెటిజన్ సలహా ఇస్తున్నాడు.

పాజిటివ్ రియాక్షన్:"సినీ రంగంలోకి ధోని నిర్మాణంలో సాక్షికి ఎల్‌జీఎమ్ మూవీ మంచి డెబ్యూ. సినిమా చూసి చాలా మంది ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. తల ఎమ్ఎస్ ధోని భవిష్యత్తులో మరిన్ని మంచి తమిళ సినిమాలు తెరకెక్కిస్తారని అనుకుంటున్నాను" అని ఓ నెటిజన్ పాజిటివ్ గా స్పందించాడు. ఇక మరకొ నెటిజన్ ఎల్‌జీఎమ్ సినిమాకు 5కు 3.5 రేటింగ్ ఇచ్చాడు.

చెత్తగా ప్రజంటేషన్:"ఎల్‌జీఎమ్ రివ్యూ. యావరేజ్ ప్లాట్ లైన్. దాన్ని మరింత చెత్తగా ప్రజంట్ చేశారు. స్క్రీన్ ప్లే ఏం బాగోలేదు. సినిమాను కాపాడేందుకు యోగిబాబు చాలా ప్రయత్నించాడు. పూర్తిగా మాత్రం సినిమా నాశనం అయింది" అని చెప్పిన ఓ నెటిజన్ 5కి 2 రేటింగ్ ఇచ్చాడు. ఇలా లెట్స్ గెట్ మ్యారీడ్ సినిమాకు తీవ్రమైన నెగిటివిటీతోపాటు మరికొంతమంది బాగుందని సపోర్ట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X