»   »  మహేష్ ‘1’: ప్లాప్ టాక్‌లోనూ 100 రోజులు!

మహేష్ ‘1’: ప్లాప్ టాక్‌లోనూ 100 రోజులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబుతో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై 'దూకుడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర మళ్లీ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో '1-నేనొక్కడినే' చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.

ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ అయింది. కొత్త దనంతో కూడుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో ఏప్రిల్ 19కి 100 రోజులు పూర్తి చేసుకుంటుందని నిర్మాతలు ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్భంగా వారు సినిమా గురించి మాట్లాడారు.

నిర్మాతలు మాట్లాడుతూ...'కొత్త కాన్సెప్టుతో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిన మా '1' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా రీసీవ్ చేసుకోవడం, 100 రోజులు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటన, సుకుమార్ డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ చిత్రాన్ని చాలా పెద్ద రేంజికి తీసుకెళ్లాయి అన్నారు.

Mahesh '1 Nenokkadine' completed 100 days

ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు కుమారుడు గౌతమ్ పరిచయం కావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు, మహేష్ బాబు అభిమానులకు మా ధన్యవాదాలు... అని నిర్మాతలు వ్యాఖ్యానించారు. తాటిపాక(ఈస్ట్ గోదావరి)లోని పద్మప్రియ థియేటర్ యాజమాన్యం తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ 'మా థియేటర్లో మహేష్ బాబు నటించిన '1' చిత్రం రోజూ 4 ఆటలతో 100 రోజులు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు.

మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ కృతి సానన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ: ఆర్.రత్నవేలు, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్.

English summary
Superstar Mahesh Babu and director Sukumar's Pongal release 1-Nenokkadine has completed its 100 days run at Padmapriya theatre in Tatipaka (East Godavari district) is the only single screen in the state.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu