twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు లండన్లో ఇంకెన్నిరోజులంటే..?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న '1'(నేనొక్కడినే) చిత్రం బెల్ ఫాస్ట్, నార్తర్న్ ఐర్లాండ్‌లలో పూర్తి చేసుకుని తాజాగా లండన్ నగరానికి షిప్టయింది. యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జులై 20 వరకు ఇక్కడ షూటింగ్ జరుపుతారని తెలుస్తోంది.

    ఈ 20 రోజుల పాటు ఇక్కడ యాక్షన్ సన్నివేశాలు, చేజింగ్ సీన్లు చిత్రీకరించనున్నారు. మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. ఇటీవలే అందుకు సంబంధించిన సీన్లు చిత్రీకరించారు.

    గౌతమ్‌ను నటింపజేసేందుకు మహేష్ ముందు ఒప్పుకోలేదని, దర్శకుడు సుకుమార్ కన్విన్స్ చేయడంతో ఒప్పుకున్నారని తెలుస్తోంది. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో గౌతమ్ పాత్ర వస్తుంది. మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

    డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సుకుమార్....చాలా కాలం పాటు స్క్రిప్టు వర్కు చేసి...వైవిధ్యమైన అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్‌గా కనిపించనున్నాడు.

    ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

    English summary
    Mahesh Babu starrer '1'(Neenokkadiney) is making brisk progress in London. The film was earlier shot in Belfast, Northern Ireland and the film unit shifted to London earlier this month. The latest buzz is that Mahesh Babu is going to shoot for this film in London till August 20.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X