కథనం కొత్తదనే... ( ‘1’ నేనొక్కడినే ప్రివ్యూ)
హైదరాబాద్ : మహేష్ బాబు సినిమా వస్తోందంటే ఆ క్రేజే వేరు. అందులోనూ విభిన్నమైన చిత్రాలు తీస్తాడనే పేరు తెచ్చుకున్న సుకుమార్ దర్శకత్వంలో అనే సరికి ఆ అంచనాలు మంరింతగా పెరిగిపోయాయి. నిర్మాతలు సైతం ఈ చిత్రానికి భారీ ఎత్తున ఖర్చుపెట్టి,పబ్లిసిటీ కూడా ఓ రేంజిలో చేసారు. స్క్రీన్ ప్లే నే హైలెట్ గా చెప్పబడుతున్న ఈ చిత్రం ప్రేక్షకులును చివరి క్షణం వరకూ థ్రిల్స్ తో మైమరిపిస్తుందంటున్నారు.
ట్రైలర్స్,టీజర్స్ చూసిన వారికి ఈ చిత్రం పక్కా ఎ,మల్టిప్లెక్స్ చిత్రం అనిపించేటట్లు ఉంది. అయితే చిత్రంలో అటువంటి అపోహలు పెట్టుకోవద్దని సుకుమార్ చెప్తున్నారు. చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని ఆయన భరోసా ఇస్తున్నారు. అదే నిజమైతే సినిమా అన్ని వర్గాల వారిని అమితంగా ఆకట్టుకుంటుంది అనటంలో సందేహం లేదు.

నిర్మాతలు అయితే ఇంట్నేషనల్ స్టాండర్డ్స్‌కు ఏ మాత్రం తగ్గనివిధంగా చిత్రాన్ని రూపొందించామని అంటున్నారు. మూసధోరణిలో కాకుండా సినిమా అంతా సరికొత్త స్క్రీన్‌ప్లేతో సాగుతోందని, ఓ రకంగా హాలీవుడ్‌రేంజ్‌లో టాలీవుడ్‌లో నిర్మించిన సినిమా ఇదని మరో నిర్మాత అనీల్ సుంకర తెలిపారు.
బ్యానర్ : 14 రీల్స్ , ఈరోస్ ఇంటర్నేషనల్
నటీనటులు:మహేష్ బాబు, కృతిసన, నాజర్, ప్రదీప్ రావత్, కెల్లీ డోర్జి, షాయాజీ షిండే, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి, సూర్య, బెనర్జి, చైతన్య మరియు మాస్టర్ గౌతమ్ తదితరులు.
కథ:జక్కా హరిప్రసాద్,
మాటలు: అర్జున్. వై.కె, శ్రీను తోట,
పాటలు:చంద్రబోస్,
డాన్స్:ప్రేమ్ రక్షిత్,
ఫైట్స్:పీటర్ హేన్స్,
ఎడిటింగ్:శివ శరవణన్,
సంగీతం:దేవిశ్రీ ప్రసాద్,
నిర్మాతలు:రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీ ల్ సుంకర,
దర్శకత్వం:బి.సుకుమార్.


Click it and Unblock the Notifications











