»   » మహేష్ బాబు ‘1’ మళ్లీ వాయిదా!

మహేష్ బాబు ‘1’ మళ్లీ వాయిదా!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న '1'(నేనొక్కడినే) చిత్రం మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఆడియో విడుదల తేదీ కూడా మారినట్లు సమాచారం. తొలుత ఈచిత్రాన్ని జనవరి 10న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జనవరి 13న విడుదల తేదీ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

  కాగా...ఆడియో విడుదల మొదట డిసెంబర్ 14 అనుకున్నారు. కానీ డిసెంబర్ 21న ఆడియో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయాలపై నిర్మాతల నుంచి అఫీషియల్ స్టేట్ మెంట్ వెలువడనుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

  Mahesh Babu

  ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే...ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ చిత్రం టోటల్ రైట్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ మొత్తం ఎంత? అనే దానిపై ఫిల్మ్ నగర్లో రకరకాల ప్రచారం జరుగుతోంది.

  14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. కృతి సనన్‌ హీరోయిన్. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: రత్నవేలు, పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

  English summary
  Mahesh Babu upcoming film '1' audio release event was earlier scheduled on December 14th is shifted to 21st. If a latest grapevine is to be believed, the movie release date is also postponed to further. Earlier the movie was slated for January 10th release and now it was moved to 13th.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more