యూరఫ్‌లో మొదలైన మహేష్ ‘1’ షూట్
హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న '1'(ఒక్కడినే)షూటింగ్ ఈ రోజు యూరఫ్‌లో మొదలైంది. నార్తన్ ఐర్లాండ్(బెల్ ఫాస్ట్), లండన్, యుకెలో 60 రోజుల పాటు ఏకధాటిగా భారీ షెడ్యూల్ జరుగుతుంది.
ఇక్కడ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలతో పాటు, పాటల చిత్రీకరణ జరుగనుంది. ఈచిత్రంలో మహేష్ బాబు సరసన క్రితి సానన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. మహేష్ బాబు గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త లుక్‌తో ఈచిత్రంలో కనిపించనున్నాడు.
డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సుకుమార్....చాలా కాలం పాటు స్క్రిప్టు వర్కు చేసి...వైవిధ్యమైన అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్‌గా కనిపించనున్నాడు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.


Click it and Unblock the Notifications











