మహేష్ కోసం విలేజ్ నిర్మిస్తున్నారు!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25 వ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రం డెహ్రాడూన్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం రామోజీఫిల్మ్ సిటీలో భారీ విలేజ్ సెట్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. చిత్రానికి సంబంధించిన కీలకమైన సన్నివేశాలని విలేజ్ నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

మహేష్ బాబు ఈ చిత్రంలో సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నాడు. అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడిగా కీలకమైన రోల్ లో నటిస్తున్నాడు. దిల్ రాజు, అశ్విని దత్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం.
More from Filmibeat
mahesh babu allari naresh pooja hegde vamshi paidipally ssmb25 mahsh25 మహేష్ బాబు అల్లరి నరేష్ పూజ హెగ్డే


Click it and Unblock the Notifications











