సూపర్ స్టార్ మహేష్ 26వ చిత్రం ఖరారు.. తిరుగులేని నిర్మాణ సంస్థ, బ్లాక్ బాస్టర్ దర్శకుడు!

మహెష్ నటించిన భరత్ అనే నేను చిత్రం ఘనవిజయం దిశగా దూసుకునిపోతోంది. భరత్ అనే నేను చిత్రంలో మహేష్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ బాబు లుక్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. భరత్ అనే నేను చిత్రానికి తొలి షో నుంచే అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దీనితో కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. మహేష్ బాబు తదుపరి చిత్రం వంశి పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనుంది. ఈ చిత్రం మహేష్ బాబుకు 25 వ చిత్రం. కాగా మహేష్ బాబు 26 వ చిత్రం కూడా ఖరారయింది. ఈ వార్త మహెష్ ఫాన్స్ కు క్రేజీ న్యూస్ అని చెప్పొచ్చు.

Recommended Video

Mahesh Babu liplock's With Namrata is Going Viral
యంగ్ సీఎంగా అదరగొట్టాడు

యంగ్ సీఎంగా అదరగొట్టాడు

భరత్ అనే నేను చిత్రం అభిమానుల అంచనాలు అందుకునే విధంగా ఉంటూ వారికీ వినోదాన్ని పంచుతోంది. దర్శకుడు కొరటాల శివ అన్ని కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్న మహేష్

నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్న మహేష్

భరత్ అనే నేను చిత్రం విజయం సాధించడంతో మహేష్ ఫోకస్ నెక్స్ట్ మూవీపై పడింది. వంశి పైడి పల్లి దర్శకత్వంలో మహేష్ నటించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలు త్వరలోనే బయటకు రానున్నాయి. వంశి పైడి పల్లి దర్శకత్వం వహించబోయే చిత్రం మహేష్ కు 25 వ చిత్రం కావడం విశేషం.

మహేష్ 26 వ చిత్రం ఖరారు

మహేష్ 26 వ చిత్రం ఖరారు

ఇకపై మహెష్ గ్యాప్ లేకుండా బిజీ షెడ్యూల్ లో గడపడానికి సిద్ధం అవుతున్నాడేమో. అందుకే 25 వ చిత్రం పార్రంభం కాక ముందే 26 వ చిత్రం కూడా ఖారైపోయింది. రంగస్థలం చిత్రంతో ఘనవిజయం అందుకున్న సుకుమార్ రెండవ సారి మహేష్ బాబుని డైరెక్ట్ చేయబోతున్నాడు.

 తిరుగులేని నిర్మాణ సంస్థ

తిరుగులేని నిర్మాణ సంస్థ

పరాజయమే ఎరుగని మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ కాంబినేషన్ లో ఇటీవల రంగస్థలం చిత్రం విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

2019 లో విడుదల

మైత్రి మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ప్రకటన కూడా చేసారు. మైత్రి మూవీ మేకర్స్, మహెష్, సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రాన్ని 2019 లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X