twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిశ్చితార్దం ఆపు చేసిన మహేష్‌ బాబు

    By Srikanya
    |

    Mahesh Aagadu at RFC
    హైదరాబాద్ : మహేష్ బాబు హడావిడిగా వచ్చి నిశ్చితార్దం ఆపేసాడు. ఎవరిది తమన్నాది. ఆమెకి కి, గిరిధర్‌కి నిశ్చితార్థం చేసేందుకు వాళ్ల కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ఈలోగా మహేష్‌ వచ్చి ఆపేశాడు. ఎందుకోసం అలా మహేష్ చేసాడు అంటే...దర్శకుడు శ్రీను వైట్ల చేయమన్నాడు. ఇదంతా 'ఆగడు' కోసం అవసరమైంది. 14రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రూపొందుతున్న సినిమా ఇది. రామోజీ ఫిల్మ్ సిటీలోని మండువా హౌస్‌లో ఈ సీన్స్ షూటింగ్ జరుగుతోంది.

    గతంలో పోకిరి,దూకుడు చిత్రాలలో పోలీస్ గా కనిపించిన మహేష్ బాబు మరోసారి పోలీస్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ఆగడు లో మహేష్ మరోసారి పోలీస్ గా తన విశ్వరూపం చూపించనున్నాడని సమాచారం. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ సారి మరింత యాక్షన్ ని పెంచినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో చేసిన బాద్షా చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకోవటంతో ఈ సారి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని శ్రీను వైట్ల ఫిక్సైనట్లు చెప్తున్నారు. అందుకు తగినట్లే మహేష్ క్యారెక్టర్ ని టఫ్ పోలీస్ గా రూపొందించినట్లు చెప్పుకుంటున్నారు.

    అంతేకాదు మహేష్‌తో జత కట్టడం తమన్నాకి ఇదే తొలిసారి. దాంతో ఆమె ఎగిరి గంతేసి ఒప్పుకుందని,కంటిన్యూ డేట్స్ కేటాయించటానికి ముందుకువచ్చిందని సమాచారం. ఇప్పటికే ఓసారి మహేష్ బాబుతో సుకుమార్ సినిమాలో చేసే అవకాశం రాగా...డేట్స్ ప్రాబ్లం వల్ల చేజార్చుకున్న తమన్నా ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరుగకుండా డేట్స్ విషయలో జాగ్రత్త పడుతోంది. దూకుడు సినిమాను మహేష్ బాబు ఇమేజ్‌కు తగిన విధంగా పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలతో వినోదాత్మకంగా రూపొందించిన శ్రీను వైట్ల....'ఆగడు' స్క్రిప్టు తన గత సినిమాలకు వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

    తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. వినోదం, యాక్షన్‌ కలగలిపిన చిత్రమిది. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

    English summary
    Mahesh babu’s AAGADU movie fresh schedule started at RFC. Mahesh,Thamanna are participating in the shooting. some family scenes were canned in a House set.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X