లవ్ స్టోరీ అని ఫీలయ్యా: మహేష్ బాబు
కథ విన్నప్పుడు ఇది ఓ లవ్ స్టోరీ అని ఫీలయ్యాను. అదే జగన్ గారికి చెప్పాను. హీరోయిన్ పాత్రకి ఇందులో ఇంపార్టెన్స్ ఉంది. ఆ పాత్రని కాజల్ చాలా బాగా చేసింది అంటున్నారు మహేష్ బాబు. బిజినెస్ మ్యాన్ చిత్రం విజయోత్సాహంలో ఆయన ఇలా స్పందించారు. అలాగే నా కెరీర్‌లో ఇదే బెస్ట్ ఫిల్మ్ అనేది నా ఫీలింగ్. 'బిజినెస్‌మేన్'ని విన్నప్పుడు టెర్రిఫిక్ స్క్రిప్ట్ అనిపించింది. నమ్మశక్యంకాని ఫైర్‌తో రాశారు జగన్. హీరోకి ఆపోజిట్‌గా గట్టి విలన్ లేకుండా ఇంత పెద్ద హిట్టవడమనేది తెలుగు సినిమాలో కొత్త పద్ధతి. అలాగే అతి తక్కువ టైమ్‌తో మంచి క్వాలిటీతో సినిమా తీయొచ్చనే విషయంలో 'బిజినెస్‌మేన్' ఓ ట్రెండ్‌ని సృష్టించింది.
ఇక 'బిజినెస్‌మేన్' సినిమాకి ఐడియా ఇచ్చింది రాంగోపాల్‌వర్మ గారు. మేం ముంబైలో షూటింగ్ చేసేప్పుడు రష్ చూసిన ఆయన నిజంగా ఎగ్జయిటయి నాతో ఫోన్‌లో మాట్లాడటం నిజంగా నన్ను ఇన్‌స్పైర్ చేసింది. ఇక పూరి జగన్నాథ్ ఇప్పటివరకు రాసిన స్క్రిప్టుల్లో ది బెస్ట్ 'బిజినెస్‌మేన్'. అది రాసేప్పుడు హీరోగా నన్నే మైండ్‌లో పెట్టుకున్నానని చెప్పారు. అది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా.'బిజినెస్‌మేన్ 2' చెయ్యాలని ఎగ్జయిటింగ్‌తో ఉన్నా. జగన్ ఆ సినిమా ఐడియాని రాము గారితో చెప్పారన్నారు. నాకింకా చెప్పలేదు. త్వరలోనే వింటా. నేనేదో నెంబర్‌వన్ పొజిషన్‌కి రావాలని అనుకోవట్లేదు. వరుసగా రెండు బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన సంతోషంలో ఉన్నా అన్నారు.


Click it and Unblock the Notifications











