'దూకుడు' నుంచి బయిటపడాలనే.. మహేష్
పోకిరి ఇమేజ్ చాలా చిత్రాల్లో పడింది. దాన్నుంచి బయట పడడానికి చాలాకాలం పట్టింది. పోకిరి తర్వాత ఏ సినిమా చేసినా దాన్ని బేరీజు వేసుకుంటున్నారు. అందులో ఒకే పాత్ర డిపెండ్ అయింది. దూకుడులో అలా లేదు. చాలా వేరియేషన్స్ ఉన్నాయి. 'దూకుడు' ఇమేజ్ రాబోయే చిత్రాల్లో పడుతుంది. దాన్నుంచి బయటపడాలంటే చాలా కసరత్తు చేయాలి. అవి ఎలాగనేది త్వరలో వచ్చే బిజినెస్‌మ్యాన్‌లో చూడండి అంటున్నారు మహేష్ బాబు. అలాగే దూకుడులో నా పాత్రకు నాలుగురకాల షేడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పటివరకు చేయలేదు. కామెడీ పండించటమే కాకుండా, పలు విధాలుగా పాత్ర పోషణ చేయటం కొత్తగా ఉంది. ఇలాంటి తరహా ప్రతీ చిత్రంలో చేయాలంటే సాధ్యం కాదు.
పూర్తిస్థాయి కామెడీ పాత్రలు చేయలేను కూడా అని తేల్చి చెప్పారు. ఆయన్ని కలిసిన మీడియాతో ఇలా స్పందించారు. ఇక నాకు 'దూకుడు' చిత్రంలో అన్ని సీన్స్ ఇష్టమే. కానీ మందుకొట్టే సీన్‌ను కొత్తగా ఉండాలని.. నాచేత తాగించకుండా కేవలం వాసన చూసి మత్తులోకి వెళ్ళినట్లు చూపించే విధానం దర్శకుడు టాలెంట్‌కు నిదర్శనం. దాన్ని ప్రేక్షకులు బాగా ఎంజారు చేస్తున్నారు అన్నారు. ఈ చిత్రాన్ని పలు బాషల్లో తీయడానికి ప్రయత్నిస్తున్నారు. హిందీలో నన్నే చేయమని కొంతమంది అడిగారు. నేను తెలుగులోనే బిజీగా ఉన్నాను. ఇప్పట్లో చేసే ఆలోచన లేదు అన్నారు.


Click it and Unblock the Notifications











