'విశ్వరూపం' చిత్రం వివాదంపై మహేష్ స్పందన
హైదరాబాద్: విశ్వరూపం చిత్రం తమిళ విడుదల విషయంలో కాంట్రవర్శి జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయమై మహేష్ మీడియా వద్ద మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... "విశ్వరూపం సినిమా చూడ్డానికి కుదర్లేదు. నేను చిన్నప్పటి నుంచి కమల్‌హాసన్‌కు పెద్ద ఫ్యాన్‌ని. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడటం చూస్తే కన్నీళ్లొచ్చాయి. ఆయన సినిమా విడుదలలో ఆటంకాలు కలగడం దురదృష్టకరం.'' అన్నారు.
వెంకటేష్‌తో కలిసి ఆయన నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్టె చెట్టు' ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న మహేష్ విలేకరులతో ముచ్చటించారు. మహేష్ మాట్లాడుతూ..."మన సినిమాల మార్కెట్ ప్రస్తుతం బాగుంది. హిట్ సినిమా పడ్డ ప్రతిసారీ టార్గెట్ రేంజ్ మారిపోతూనే ఉంది. 'పోకిరి', 'మగధీర' ఇప్పుడు సీతమ్మ వాకిట్లో కావచ్చు. ఎప్పటికప్పుడు కొత్త మార్క్‌ను దాటుకుంటూ పోవాల్సి ఉంటుంది. పైరసీని కంట్రోల్ చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది అన్నారు.
అలాగే పొరుగు రాష్ట్రాల హీరోలు మార్కెట్‌ను విస్తరించుకుంటున్నారు. మన మార్కెట్ కూడా పరిధిని పెంచుకోవాలంటే కథల్లో మార్పు రావాలి. యూనివర్శల్ సబ్జెక్టులుంటే అందరూ ఆమోదిస్తారు. తెలుగును వదిలి నేరుగా బాలీవుడ్ సినిమాలు చేయమంటే నేను చేయనుగానీ, అన్నీ కుదిరి ద్విభాషా, త్రిభాషా చిత్రంగా మలిచేవారుంటే నాకేం అభ్యంతరం లేదు. మణిరత్నంగారు 'పొన్నియన్ సెల్వన్' చేద్దామన్నారు. కానీ బడ్జెట్ మరీ ఎక్కువవుతుందని, తర్వాత చేద్దామని చెప్పారు అని చెప్పారు.


Click it and Unblock the Notifications











