ఇండస్ట్రీ జనం ఇబ్బంది పెట్టారు: మహేష్ బాబు
బిజినెస్ మ్యాన్ దర్శకుడు పూరీ జగన్నాధ్ గురించి మహేష్ మాట్లాడుతూ...పూరి జగన్నాధ్ ఎప్పూడూ తన ఫ్లాప్ లకు డిజప్పాయింట్ కాలేదు. ఆయన ఎప్పుడూ హ్యాపీగా ఉంటాడు..చిరునవ్వుతో కనిపిస్తూంటాడు. ఆయన సినిమా రిజల్ట్ ఎలా వచ్చినా దాన్ని పట్టించుకోడు. కానీ కొందరు ఇండస్ట్రీ జనాలు గత కొంత కాలంగా ఆయన్ని ఇబ్బంది పెట్టారు. ఆ ప్రస్టేషన్ మొత్తాన్ని ఆయన బిజినెస్ మ్యాన్ లో చూపించారు. ఓ కోపంతో ఆయన ఈ చిత్రాన్ని తీర్చి దిద్దారు. అందుకే డైలాగుల్లో అంత ఫైర్ కనిపిస్తుంది అన్నారు. మహేష్ తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ హిట్టవటంతో ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారు.
బిజినెస్ మ్యాన్ చిత్రం ప్రమోట్ చేస్తూ బిజీ బిజీగా అచ్చం బిజినెస్ మ్యాన్ లా ఉన్నారు. దాంతో ఓ ఇంగ్లీష్ డైలీ ఆయనతో పూరీ గురించి అడిగినప్పుడు ఇలా స్పందించారు. అలాగే ఈ చిత్రం స్క్రిప్టు ని నేను పూరీ జగన్నాధ్ లో కాన్ఫిడెన్స్ చూసి ఒప్పుకున్నాను. పదిహేను రోజులు తర్వాత మాత్రమే పూరీ ఈ చిత్రం ప్లాట్ చెప్పాడు. నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను...ఒకరు మరొకరి పనిలో ఎప్పుడూ జోక్యం కలగచేసుకోకూడదనే విషయం. నేను గుడ్డిగా డైరక్టర్ కే పూర్తిగా సరెండర్ అయ్యిపోయాను..అందుకే ఇంత విజయం సాధించగలిగాను అన్నారు. ఇక ఇంత తక్కువ సమయంలో చిత్రం పూర్తి చేయటంపై ఆయన మాట్లాడుతూ...నేను ఖచ్చితంగా ఇది ఓ కొత్త ట్రెండ్ గా భావిస్తున్నాను. చాలా మంది ఇండస్ట్రీలో దీన్ని ఫాలో అవుతారని భావిస్తున్నాను. మేము కేవలం రికార్డు సమయంలో సినిమాను కంప్లీట్ చేయటమే కాదు...దాన్ని బ్లాక్ బస్టర్ హిట్ గా కూడా మార్చగలిగాం. ఇది బడ్జెట్ కంట్రోల్ విషయంలో ఓ పాఠం.మేము ఈ విధంగా చేయటం వల్ల షూటింగ్ కి అయ్యే ఖర్చు చాలా తగ్గిపోయింది అన్నారు.


Click it and Unblock the Notifications











